తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన హీరో శోభన్ బాబు. ప్రేమ కథలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని అందాల నటుడిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అప్పట్లో ఆయన అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ హీరోకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది.ఈ నేపథ్యంలోనే ఇద్దరు భార్యలతో శోభన్ బాబు ఇరకాటంలో పడ్డ అప్పటి సెన్సేషనల్ హిట్ ఏవండీ అవిడొచ్చింది మూవీ గురించి తెలుసుకుందాం.ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో శోభన్ బాబు ,శారద, వాణిశ్రీ కల్సి నటించిన ఏవండీ ఆవిడ వచ్చింది మూవీ అప్పట్లో ఓ సెన్షేషన్. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వాణిశ్రీ హిట్ మీద హిట్ అందుకుంటున్న సమయంలో వచ్చిన సినిమా ఇది. అప్పటి వరకూ ఇద్దరమ్మాయిల ప్రేమ మధ్య నలిగిపోయే పాత్రకు పెట్టింది పేరుగా నిల్చిన నటభూషణ శోభన్ బాబు ఇద్దరు భార్యల నడుమ నలిగిపోయే భర్తగా అద్భుతంగ నటించారు. నిజానికి శారద, వాణిశ్రీ హీరోయిన్స్ గా రాణిస్తున్న సమయంలో ఇద్దరి కాంబోలో సినిమా తీయాలని చూసినా పనవ్వలేదు. కానీ ఓ ఏజ్ కి వచ్చాక భార్యలుగా కల్సి నటించిన చిత్రమిది. సీతారత్నం గారబ్బాయి మూవీ తర్వాత ఏవండీ ఆవిడ వచ్చింది మూవీకోసం కథ రెడీ చేయమని కె ఎన్ ప్రసాద్ కి అప్పగించారు.

తల్లిదండ్రుల వత్తిడి మేరకు రెండు పెళ్లిళ్లు చేసుకుని, మూడు రోజులు ఒకరి దగ్గర, మరో మూడు రోజులు ఇంకొకరి దగ్గర గడిపే భర్త గా, ఒకరోజు పేరెంట్స్ దగ్గర గడిపే కొడుకు ఇలా మూడు రకాలుగా హీరో ఉండేలా రూపొందిన ఈ కథ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ, దర్శకుడు ఈవివికి బాగా నచ్చేసింది. ముందు వాణిశ్రీ దగ్గరకు వెళ్లి చెప్పడంతో ఒకే అయింది. రెండో పాత్రలో శారద నటిస్తారని కూడా చెప్పడంతో దానికి ఒకే అనడంతో శారద ను సంప్రదించారు. ఇక రిటైర్మెంట్ సమయంలో ఇలాంటి మంచి కథతో వచ్చినందుకు శోభన్ బాబు ఆనందపడుతూ వెంటనే డేట్స్ ఇచ్చేసారు.మొత్తానికి సినిమా పట్టాలెక్కింది. యువ జంటగా హరీష్, రంభ నటించారు. సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్, బ్రహ్మానందం, శివాజీ రాజా తదితర యాక్టర్స్ తమ దైన శైలిలో ఆకట్టుకున్నారు.ఈ సినిమా కి కోటి అదిరిపోయే మ్యూజిక్ అందించారు.గంగను చూస్తే గౌరికి మంట గౌరిని చూస్తే గంగతో తంటా సాంగ్ శోభన్ బాబు ఫాన్స్ కి తెగనచ్చేసింది. అలాగే ఇప్పటికి ఆ పాట ఫేమస్.బ్రహ్మానందం, ఐరెన్ లెగ్ శాస్త్రి కామెడీ ప్రేక్షకుల చేత నవ్వులు పూయించింది. 1993మార్చి 5న వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. సాంగ్స్ అన్నీ హిట్.ఇదిలావుండగా ఈ మూవీ శతదినోత్సవానికి విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా రావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: