* భార్య ప్రియురాలి మధ్య నలిగిపోతూ ప్రేక్షకులను అల్లరించాడు
* ఈ సినిమా థియేటర్లలో బిగ్గెస్ట్ హిట్టు
2011లో సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన యాక్షన్ కామెడీ చిత్రం "మిరపకాయ్" బాక్సాఫీస్ హిట్ అయిన సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో రిచా గంగోపాధ్యాయ రవితేజ భార్యగా నటించింది. దీక్షా సేథ్ ప్రియురాలిగా యాక్ట్ చేసింది. అయితే మీరు ఇద్దరి మధ్య నలిగిపోయినా ఒక మగవాడిలాగా రవితేజ ఇందులో నటించాడు ఈ స్టోరీ మామూలుగానే ఉంటుంది కానీ దర్శకుడు హరీశ్ శంకర్ ఇందులో మంచి ఎంటర్టైన్మెంట్ ఆఫర్ చేశాడు. ఇందులోని పంచులు కేకో కేక అని చెప్పుకోవచ్చు. ఇక రవితేజ పండించిన కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్.
సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఒక మాస్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఇందులో స్వాతి రెడ్డి కూడా ఒక సన్నివేశంలో యాక్ట్ చేసి మెప్పించింది. రిచా గంగోపాధ్యాయ లుక్స్ ఇందులో చాలా బాగుంటాయి ముఖ్యంగా రవితేజతో ఆమె నటించిన సీన్లు బాగా పండాయి వారి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇందులో ఏమైనా రవితేజ నిజంగా ప్రేమిస్తాడు వైశాలి పాత్ర వేసిన దీక్షా సేథ్ ను కేవలం కొంత ఇన్ఫర్మేషన్ రావటానికి లవ్ చేస్తాడు. అయినా సరే ఇద్దరు కూడా ఈ హీరోని బాగా ప్రేమిస్తారు. వారిద్దరి నడుమ ఇతను నలిగిపోతూ ఉంటాడు. ఆ సీన్లు భలే టైం చేస్తాయి.
ఎస్.ఎస్ తమన్ కంపోజ్ చేసిన పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి మంచి స్ట్రెంత్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, నాగబాబు సపోర్టింగ్ రోల్స్ చేశారు. దీనిని హిందీలో ఖల్లాస్గా, తమిళంలో మురట్టు సింగం పేరుతో డబ్ చేయగా ఇక్కడ కూడా ఇది పెద్ద హిట్ అయింది. రవితేజ మళ్లీ ఇలాంటి సక్సెస్ కోసం ఎంతో ప్రయత్నించాడు కానీ ఇటీవల కాలంలో అలాంటి సక్సెస్ అతనికి దొరకడం లేదు. కొత్త కథలను ట్రై చేస్తున్నాడు కానీ అవేమీ ప్రేక్షకుల్లో ఒక ఆసక్తిని కలిగించడం లేదు. పురాణాలు ఇంకా దైవానికి సంబంధించిన కథలతో తీస్తే సినిమాలు హిట్ అవుతున్నాయి. రవితేజ ఈ విషయాన్ని గ్రహించాలి.