ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఎలా విడదీయరాని అభినవభావ సంబంధం ఏర్పడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రిలో నటించే స్టార్స్ అందరూ కూడా రాజకీయాలలోకి అడుగుపెట్టి తమదైన స్టైల్ లో ప్రత్యేక ముద్ర వేయించుకుంటున్నారు . అది తెలుగు ఇండస్ట్రీ కాదు. మలయాళం ఇండస్ట్రీ కాదు.  బాలీవుడ్ ఇండస్ట్రీ కాదు . ఏ రంగమైన  సరే రాజకీయాలలోకి రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్టార్స్.  రీసెంట్గా ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . గోద్రా అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎంత అండ్ పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా ఆ సమయంలో ఏం జరిగింది? అసలు నిజానిజాలు ఏంటి ..? అని చూపించే విధంగా సినిమాని బాగా సపోర్ట్ చేశారు బిజెపి మద్ధతు దారులు.


మోస్ట్ ఆఫ్ ద టైం ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూ వచ్చాయి . ప్రేక్షకులు స్పందన కూడా చాలా చాలా బాగుంది . అయితే మోడీని పాజిటివ్ కోణంలో చూపించిన సినిమా కావడంతో మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి బిజెపి ప్రభుత్వం ఈ సినిమాకి పన్ను కూడా మినహాయింపు ఇవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది . అంతేకాదు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తాను త్వరలోనే ఈ సినిమాను చూడబోతున్నట్లు చెప్పుకొచ్చారు . అంతేకాకుండా ప్రతి ఒక్క పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా ఈ సినిమాని చూడాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు.  "గోద్రా ఘటన ఎప్పటికి మర్చిపోలేని ఒక చేదు గతం అని.. దీని మీద చెత్త రాజకీయాలు చేసిన కొన్ని రాజకీయ పార్టీలు అసలు వాస్తవాలను  కప్పి పెట్టేశాయని ఇక.. ఇప్పుడు ‘సబర్మతి రిపోర్ట్’ ద్వారా అసలు నిజాలు  బయటికి వస్తున్నాయని కూసింత ఘాటుగానే చెప్పుకొచ్చాతు".



అయితే ఇదే విధంగా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనూ సీఎం చంద్రబాబు నాయుడు పుష్ప 2 సినిమాను అందరూ చూసే విధంగా మాట్లాడితే బాగుంటుంది అంటూ జనాలు కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే పుష్ప2 సినిమా రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5వ తేదీ గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న మూమెంట్లో ఫ్యాన్స్ పలు రకాలుగా ఈ సినిమాకి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహాన్ యాదవ్ ఎలా అయితే సబర్మతి రిపోర్ట్ సినిమాని చూడండి అని  పిలుపునిచ్చారో.. అదేవిధంగా పుష్ప2 సినిమాని కూడా చంద్రబాబునాయుడు చూడండి అని చెప్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త ఫుల్ ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. అయితే ఇక్కడే జనాలు ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు . సబర్మతి రిపోర్ట్ అనేది జనాలకి ఉపయోగపడే సినిమా కాబట్టి సీఎం సూచించడంలో తప్పులేదు.. పుష్ప2 ఎవరికి ఉపయోగపడుతుంది ..? దేనికి ఉపయోగపడుతుంది..? ఎందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆ సినిమా చూడాలి అంటూ సపోర్ట్ చేయాలి అని కొంతమంది జనాలు  నిలదీస్తున్నారు..!????

మరింత సమాచారం తెలుసుకోండి: