ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో వచ్చే రివ్యూస్ సినిమా ఇండస్ట్రీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అంటున్నారు డైరెక్టర్లు - ప్రొడ్యూసర్లు.  మరీ ముఖ్యంగా ఒక బడా సినిమా ఏదైనా రిలీజ్ అవుతుంది అంటే కచ్చితంగా దానిపై స్పెషల్ టీం ఫోకస్ చేస్తుంది అని పలువురు వెబ్ రిపోర్టర్స్ ఆ సినిమాను చూసి ఆ సినిమాకి రివ్యూ ఇస్తున్నారు .  కొంతమంది జెన్యూన్ గా రివ్యూ ఇస్తుంటే మరి కొంతమంది మాత్రం సినిమా బాగున్న బాగోలేదు అంటూ రివ్యూ ఇస్తున్నారు అని జనాలు మాట్లాడుకుంటూ సినిమా ఇండస్ట్రిలో స్టార్స్ కూడా అదే విధంగా మండిపడుతూ వస్తున్నారు .


అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. త్వరలోనే పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాబోతుంది.  ఆ తర్వాత కూడా బడా బడా సినిమాలు లైన్లో ఉన్నాయి . మరి ముఖ్యంగా పుష్ప 2, గేమ్ చేంజెర్ అదే విధంగా విశ్వంభర.. అదే విధంగా వార్ 2 సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు జనాలు.  సినిమా బాగుంటే బాగుంది అని రివ్యూ ఇస్తారు.. బాగోలేకపోతే సినిమాలో నెగిటివ్ లు ఇవి అని రివ్యూ ఇస్తారు.  అయితే జనాలను థియేటర్స్ కి రప్పించుకునే సత్తా మాత్రం డైరెక్టర్ అదే విధంగా సినిమాలో నటించే స్టార్స్ పైనే ఆధారపడి ఉంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు .



అంతేకాదు ఒక రిపోర్టర్ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ రాసినంత మాత్రాన సినిమా మొత్తం ఫ్లాప్ అవ్వదు అని..  ఒకవేళ థియేటర్ కి జనాలు రాకపోతే ఆ బాధ్యత మొత్తం ఆ తప్పు మొత్తం కూడా స్టార్స్ పైన పడుతుంది అని చెప్పుకొస్తున్నారు.  అంతేకాదు ఇప్పుడు పుష్ప2పై అందరి కళ్ళు పడ్డాయి . సినిమాకి నెగిటివ్ రివ్యూలు కచ్చితంగా వస్తాయి . అందులో డౌటే లేదు.  పుష్ప2పై ఇప్పుడే ట్రోలింగ్ స్టార్ట్ చేశారు .ఒకవేళ పుష్ప2 సినిమా నెగిటివ్ రివ్యూలు దక్కించుకున్న కూడా జనాలు థియేటర్స్ కి వచ్చి సినిమా చూశాడు అంటే మాత్రం ఖచ్చితంగా అది బన్నీ ఘనతనే చెప్పాలి . అయితే ఆ తర్వాత గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ పరిస్థితి ఏంటి..? విశ్వంభర సినిమాలో చిరంజీవి పరిస్థితి ఏంటి ..? అనేది ఇప్పుడు అందరికీ హాట్ టాపిక్ గా ఉంది . మరి సినిమాల రివ్యూ లతో మాకు సంబంధం లేదు అంటూ జనాల అభిమానాని ఈ హీరోలు అందుకోగలరా..? అలాంటి కామెంట్స్ చేసే వాళ్ళ నోరులు మూయించగలరా..? అన్నది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: