డైరెక్టర్ శంకర్ మణిరరత్నం తర్వాత తెలుగు వాళ్లకు తమిళ సినిమాపై ఆసక్తి కలిగించిన దర్శకుడు. తమిళ సినిమాని కమర్షియల్ గా పైకి లేపిన డైరెక్టర్. ఎంతోమంది 80s, 90s కిడ్స్ కి స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ గా ఇప్పుడు రాజమౌళి అందుకుంటున్న జేజేలు శంకర్ తన సినిమాలతో ఎప్పుడో అందుకున్నాడు.ఈ నేపథ్యంలో నే రోబో సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఆ సినిమాకు మంచి క్రేజ్ దక్కింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగు తమిళ్ లో కూడా అత్యదిక వసూళ్లను అందుకుంది.అయితే ఆ సినిమా లో నటించాల్సింది రజనీకాంత్ కాదు బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. అవును రోబో సినిమా లో రోబో పాత్రలో షారుక్ ఖాన్ నటించాలని శంకర్ భావించాడు. షారుక్‌ ఖాన్‌కి కూడా కథ నచ్చడంతో పాటు ప్లాన్స్‌ కూడా బాగా నచ్చాయి. ఆ సినిమా ను తానే నిర్మిస్తానని ముందుకొచ్చాడు. ఈ ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైంది. ఈ సినిమా లో హీరోయిన్ డేట్స్ కూడా తీసుకున్నారు. అయితే ఆ తర్వాత షారుక్ ఖాన్ సడెన్ గా ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

గతంలో దీని గురించి మాట్లాడిన షారుక్ ఖాన్, నేను ఆ సినిమా కు చాలా పనిచేశాను. శంకర్, నేను చాలా చర్చలు జరిపాం. ఆ సినిమా కోసం ప్రియాంక చోప్రా డేట్స్ తీసుకున్నాం. ఫ్యాషన్ నుంచి తప్పుకున్న తర్వాత ప్రియాంక చోప్రా మాకు నాలుగు నెలల డేట్స్ ఇచ్చింది. అయితే చివరకు కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు రావడంతో రోబో సినిమా ను వదులుకోవాల్సి వచ్చింది. అని చెప్పుకొచ్చాడు.శంకర్ మేకింగ్ ప్రాసెస్ వేరు. రోబో చేయడానికి రెండేళ్లు సమయం అడిగాడు. నేను చేయలేను అని చెప్పాను. ఒక్క స్ట్రెచ్‌లో పూర్తి చేయమని అడిగాను. అతను, ఈ కొత్త తరహా చాలా మారుతూనే వుంటుంది. రీ షూట్‌లు ఉంటాయని, ఒక్క స్ట్రెచ్‌లో పూర్తి చేయడం కుదరదని అన్నారు. కానీ నిర్మాతగా అలా చేయలేకపోయాను. రెండేళ్ల పాటు ఇతర నటీనటులను డేట్స్ ఎలా అడుగుతాడు, అందుకే నేనూ, శంకర్ ఇద్దరం అంగీకరించి ఆ సినిమా కు దూరంగా ఉన్నాం.అని షారుక్ ఖాన్ అసలు విషయం చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం శంకర్ రాంచరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ తో బిజీ గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: