ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఇదే తేదీన తమిళ నటుడు శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా రూపొందిన అమరన్ అనే డబ్బింగ్ సినిమా కూడా తెలుగులో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలకు సంబంధించిన 20 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి ఈ 20 రోజుల్లో ఈ రెండు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.

20 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి లక్కీ భాస్కర్ మూవీ కి నైజాం ఏరియాలో 9.28 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 2.63 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 8.30 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకి 20 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20.21 కోట్ల షేర్ ... 34.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ సినిమా 15 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగి ఇప్పటికే 5.21 కోట్ల లాభాలను అందుకుంది.

ఇక 20 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి అమరన్ మూవీ కి నైజాం ఏరియాలో 10.66 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 2.84 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 9.56 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 20 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 23.06 కోట్ల షేర్ ... 40.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో  5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 5.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగి ఇప్పటికే 17.56 కోట్ల లాభాలను తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: