టాలీవుడ్ ఇండస్ట్రీలో రైటర్ గా, కమెడియన్ గా తనకంటూ పోసాని కృష్ణమురళి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. టెంపర్ సినిమాలో నారాయణమూర్తి పాత్ర పోసానికి పాపులారిటీని సైతం పెంచింది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పోసాని వైసీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో కూటమి నేతలపై పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా పోసాని వార్తల్లో నిలిచారు.
 
పోసానిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది. పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారని సమాచారం అందుతోంది. పోసాని తీసుకున్న ఈ నిర్ణయం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఇకపై తాను చనిపోయే వరకు పాలిటిక్స్ గురించి మాట్లాడనంటూ పోసాని సంచలన ప్రకటన చేశారు.
 
పోసానిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో పోసాని మాట్లాడుతూ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేపింది. తాను ఏ పార్టీని పొగడనని ఏ పార్టీని తిట్టనని పోసాని తెలిపారు. తాను ఎప్పుడూ మంచి రాజకీయ నాయకుల గురించి విమర్శలు చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. నరేంద్ర మోదీ తనకు 35 సంవత్సరాలుగా తెలుసని ఆయనను ఎప్పుడూ విమర్శించలేదని పేర్కొన్నారు.
 
ఇందిరా గాంధీ, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్లను విమర్శించలేదని ఆయన చెప్పుకొచ్చారు. పోసాని చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. పోసాని ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. పోసాని భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. పోసాని కెరీర్ విషయంలో ఇకపై తప్పటడుగులు వేయొద్దని శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. పోసాని కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. పోసాని తనపై వస్తున్న విమర్శల గురించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: