టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రాజకీయాలలో బాగా ఉపయోగపడింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ రేణు దేశాయ్ కూడా బాగా సుపరిచితమే.. వీరిద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకున్న కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగింది.ముఖ్యంగా వీరిద్దరు విడిపోయిన.. కూతురు అధ్యా, కొడుకు అకీరా విషయంలో మాత్రం ఎప్పుడు కూడా జాగ్రత్తగానే దగ్గరుండి మరి బాధ్యతలను చూసుకుంటూ ఉంటారు.


అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తల్లి.. మృతి చెందినట్లుగా రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్త గారు అవుతారు.. ఈ విషయం తెలిసిన అటు అభిమానులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ తెలియజేస్తున్నారు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ ముఖ్యంగా తన కుటుంబం గురించి పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.


రేణు దేశాయ్ తల్లికి సంబంధించి పాత ఫోటోని షేర్ చేస్తూ" ఆ ఫోటో మీద ప్రశాంతంగా ఉండు అమ్మ అంటూ ఓం శాంతి పుట్టిన వారు మరణించక తప్పదు అన్నట్టుగా తెలియజేసింది.. అలాగే మరణించిన వారు మళ్లీ పుట్టక తప్పదు అంటూ ఒక అర్థం వచ్చేలా ఒక కొటేషన్ ని సైతం షేర్ చేసింది రేణు దేశాయ్". పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉండడమే కాకుండా రాజకీయాలలో కూడా డిప్యూటీ సీఎం హోదాలో కొంటూ తన రేంజ్ పెంచుకుంటూ ఉన్నారు. రేణు దేశాయ్ మాత్రం ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీ యంట్రి ఇచ్చిన పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా కనిపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: