వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం 'మట్కా'. ఈ సినిమాకు డైరెక్టర్ కరుణాకరన్ కుమార్ దర్శకత్వం వహించారు. వైరా ఎంటర్టైన్మెంట్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విజయేంద్ర రెడ్డి తీగల, రజిని తాళ్లూరి నిర్మించారు. ఈ సినిమాలో మట్కా గ్యాంగ్ స్టార్ వాసుగా వరుణ్ తేజ్ నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్లు సుజాతగ మీనాక్షి చౌదరి, సోఫియాగా నోరా ఫతేహి లీడ్ లో నటించారు. ఈ సినిమాలో సలోని అశ్వని.... పద్మ, నారాయణ మూర్తిగా పి. రవి శంకర్, నాని బాబుగా కిషోర్, అప్పల రెడ్డిగా అజయ్, సాహుగా నవీన్ చంద్ర కీలక పాత్ర లో కనిపిస్తున్నారు.


తాజాగా వచ్చిన మట్కా సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. మాస్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైనర్ గా తెరరకెక్కిన ఈ సినిమాపై వరుణ్ తేజ్ భారీ ఆశలను పెట్టుకున్నారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఎంతలా అంటే మెగా అభిమానులే ఈ సినిమాకు దూరంగా ఉన్నారంటే మట్కా సినిమా ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

 
ఈ సినిమాకు దారుణంగా రూ. 64 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసినట్టుగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కనీసం మెగా అభిమానులు, జనసైనికులు ఈ సినిమాను చూసిన ఇంత తక్కువ అమౌంట్ వచ్చి ఉండేది కాదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ చాలామంది లావణ్య త్రిపాఠి ని చూసి ఈ సినిమాకు వెళుతున్నారని టాక్ వినిపిస్తోంది.


వరుణ్ తేజ్ వివాహ అనంతరం ఇప్పటివరకు ఒక్క సక్సెస్ మూవీ అయినా చేయలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి వల్లనే వరుణ్ తేజ్ కు అస్సలు కలిసి రావడం లేదంటూ కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఈ వార్తలపై వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: