మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ హీరో గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మాణంలో భారీగా బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


దీంతో మెగా ఫ్యాన్స్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే రామ్ చరణ్ ఆంధ్రప్రదేశ్లోని కడప దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి అధికారులు రామ్ చరణ్ కు ఘనంగా స్వాగతం పలికారు. అయితే రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో అమీన్పూర్ దర్గాను సందర్శించడంతో హిందూ సమాజం, అయ్యప్ప భక్తులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.



రామ్ చరణ్ వెంటనే అయ్యప్ప మాలను తొలగించి స్వామివారికి క్షమాపణలు కోరాలని అంటున్నారు. యావత్ అయ్యప్ప భక్తులకు, హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించింది. దేవుడిపై విశ్వాసం అందరినీ ఏకం చేస్తుందని, చిన్నాభిన్నం చేయదన్నారు.


భారతీయు లందరూ అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తారని ఐకమత్యంలోనే బలం ఉందన్నారు ఉపాసన. రామ్ చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను కూడా గౌరవిస్తారు అంటూ ఉపాసన సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. వన్ నేషన్ వన్ స్పిరిట్ హ్యాష్ ట్యాగ్ ను జోడించారు. సోషల్ మీడియా వేదికగా ఉపాసన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా....  రామ్ చరణ్ అలాగే ఉపాసన జంటకు దాదాపు పది సంవత్సరాల తర్వాత... ఓ పండంటి ఆడబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో... పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చింది మెగా కోడలు ఉపాసన.



మరింత సమాచారం తెలుసుకోండి: