ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పుష్ప సినిమాను, ఆ ట్రైలర్ను మెగా హీరోలు ఎవరు కూడా అభినందించడం లేదు. మిగతా హీరోలు అందరూ పుష్ప ట్రైలర్ బాగుందని కామెంట్స్ పెడితే... ఇప్పటివరకు మెగా హీరోలు స్పందించలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే పుష్ప సినిమా ను పైకి లేపేందుకు వైసిపి పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే ఓ మాజీ ఎమ్మెల్యే.... పుష్ప సినిమాపై ప్రశంసలు కురిపించారు. దానికి అల్లు అర్జున్ కూడా రియాక్ట్ కావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ తో గొడవల కారణంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా పైన మెగా హీరోలు స్పందించడం లేదని వార్తలు వస్తున్నాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేలా జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగారట. ఇప్పటినుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు పుష్ప సినిమాను అలాగే అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో పైకి లేపాలని ఆదేశాలు ఇచ్చారట.
ప్రతి ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రులు కూడా పుష్ప సినిమా చూసి... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం కూటమికి షాక్ ఇచ్చేలా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఇలా చేస్తే అల్లు అర్జున్ సినిమా సక్సెస్ అయి... మెగా హీరోలకు కూడా ఇవ్వవచ్చని అనుకుంటున్నారట. ఇక దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్... వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.