గత వారం రోజుల నుండి కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియా మొత్తం ఎన్ని వార్తలు వినిపిస్తున్నాయో చెప్పనక్కర్లేదు.కీర్తి సురేష్ పెళ్లి వార్తలు గత రెండు మూడు సంవత్సరాల నుండి వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడు వినిపించే వార్తలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎందుకంటే పెళ్లి డేట్ ని కూడా ఫిక్స్ చేసి తమిళ మీడియా వర్గాల్లో ఈ వార్తలు చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ నిజంగానే కీర్తి సురేష్ పెళ్లి కాబోతుంది అని భావిస్తున్నారు. మరి ఇంతకీ కీర్తి సురేష్ పెళ్లి వార్తలపై తండ్రి సురేష్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.. కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి ఆంటోనీ తటిల్ ని చాలా సంవత్సరాల నుండి ప్రేమిస్తుందని, వీరిద్దరూ గత పది సంవత్సరాల నుండి డేటింగ్ లో ఉన్నారని, అందుకే కీర్తి సురేష్ ఎన్నిసార్లు వేరే హీరోలతో పెళ్లి వార్తలు వినిపించినా కూడా వాటిని ఖండిస్తుందని అంటున్నారు. 

అంతేకాదు గత వారం రోజుల నుండి తన ఫ్రెండు ఆంటోని తట్టిల్ ని పెళ్లి చేసుకోబోతున్నారని ఫోటోతో సహా సోషల్ మీడియాలో న్యూస్ వస్తున్నా కూడా కీర్తి సురేష్ స్పందించడం లేదంటే ఈ వార్త నిజమేనని ఆమె అభిమానులు భావిస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో ఈ న్యూస్ వినిపిస్తున్న వేళ తాజాగా రెడ్డిట్ లో కీర్తి సురేష్ తండ్రి సురేష్ మాట్లాడిన దాని ప్రకారం చూస్తే డిసెంబర్ రెండో వారంలో కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందట.. వీరి పెళ్లి గోవాలోని లగ్జరీ రిసార్ట్ లో జరగబోతున్నట్టు ఆయన తెలియజేసారట.అలాగే కీర్తి సురేష్ ఆంటోనీల పెళ్లి డిసెంబర్ 11 లేదా 12వ తేదీన జరగబోతున్నట్టు రెడ్డిట్ లో రాసుకోచ్చారు.

ప్రస్తుతం రెడ్డిట్లో వచ్చిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఇది నిజమేనని భావిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి దుబాయ్ లో ఓ పెద్ద బిజినెస్ మాన్ అని తెలుస్తోంది. ఆయనకు చెన్నై లో కూడా పలు వ్యాపారాలు ఉన్నాయట. అలా చిన్నతనం నుండి ఆంటోనీ కీర్తి సురేష్ ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. అలా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి పెద్దలకు తెలియజేయడంతో వాళ్లు కూడా ఒప్పుకున్నారట.ఇక కీర్తి సురేష్ మంచి నటి అలాగే కీర్తి సురేష్ పేరెంట్స్ కూడా తమకి కాబోయే అల్లుడు ఎలా ఉండాలో ఆ క్వాలిటీస్ అన్ని ఆంటోనీ లో ఉన్నాయి అని గుర్తించి తమ ఇంటి అల్లుడుగా చేసుకోవడానికి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: