- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )  . .

మెగా హీరోల్లో వరుణ్ తేజ్ పరిస్థితి కొంచెం కష్ట పరిస్థితులలో ఉంది ఇప్పుడు. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసే వరుణ్ మెల్లగా కమర్షియల్ దారి పట్టటం ఆయా సినిమాలు వరుసగా డిజాస్టర్లు కావడంతో వరుణ్ తేజ్ కెరీర్ ఇబ్బందుల్లోకి వెళ్లిపోయింది .. ఒకటి కాదు రెండు కాదు వరుసగా 4 ప్లాపులు తగిలాయి. గ‌ని - ఆపరేషన్ వాలంటైన్ - గాంఢీవ ధారి అర్జున - మట్కా ఇవి మామూలు ప్లాపులు కావు. ఇలాంటి పరిస్థితులలో ఏ హీరో అయినా రెమ్యూనరేషన్ తగ్గించుకుని నిర్మాతలకు అందుబాటులో ఉండాలని ఒకటి రెండు హిట్ సినిమాలు పడాలని చూస్తారు .. కానీ వరుణ్ తేజ్ మాత్రం తన పారితోషకం ఏమాత్రం తగ్గించలేదు అన్నది టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల టాక్.


ప్రస్తుతం ఒక్కో సినిమాకు 7 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు అని సమాచారం. ఇటీవల ఓ నిర్మాత వరుణ్ ని సంప్రదిస్తే ఏడు కోట్ల పారితోషకం అడిగాడట. తన చేతిలో ఇప్పుడు కొరియన్ కనకరాజు అనే సినిమా ఉంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మేర్ల‌పాక‌ గాంధీ దర్శకత్వం వహించే ఈ సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ తో పాటు - ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ఏడు కోట్ల పారితోషం అందుకుంటున్న వ‌రుణ్‌ కొత్త సినిమాలుకు కూడా తనకు ఏడు కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


కొంతమంది హీరోలు అంతే ... ప్లాపులకు అందుకునే రెమ్యూనరేషన్కు ఏమాత్రం సంబంధం ఉండదు. ఒకవేళ పారితోషం తగ్గిస్తే .. క్రేజ్‌ తగ్గిపోయిందేమో మార్కెట్ తగ్గిపోయిందేమో అని ఇండస్ట్రీలో గుసగుసలు వస్తాయని వాళ్ళ భయం. రవితేజ కూడా ఇంతే సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతున్న పారతోష‌కం త‌గ్గించేవాడు కాదు .. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా అదే చేస్తున్నాడు. మీడియం రేంజ్ హీరోలకు మినిమం ఓ టి టి గ్యారెంటీ ఉంటుంది. అందుకే రెమ్యూనరేషన్ స్టడీగా ఉంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: