ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద బ్యానర్ .. స్టార్ ప్రొడ్యూసర్ ఎవరు అంటే గత పది ఏళ్ల‌కు పైగా దిల్ రాజు పేరు ప్రముఖంగా వినిపించేది. దిల్ రాజు చాలా తక్కువ టైంలోనే వరుస‌పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకొచ్చారు. అసలు టాలీవుడ్ లో దిల్ రాజు చెప్పిందే వేదం ఆయన ఏం చెబితే అదే అన్నట్టుగా నడిచేది. అటు వరుసగా నిర్మాతగా సూపర్ డూపర్ హిట్లు తీయడంతో పాటు ఇటు పంపిణీ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే ఇప్పుడు దిల్ రాజును సైడ్ చేసి మైత్రి మూవీ మేకర్ సంస్థ ముందుకు దూసుకు వచ్చింది. ప్రస్తుతం వాళ్ళ సినిమాల లైను చూస్తే నోరెళ్ల పెట్టడం ఖాయం. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు అందరితోనూ వీళ్ళు వరుసగా సినిమాలు చేస్తున్నారు.


మరో విశేషం ఏంటంటే కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ్ - హిందీ మార్కెట్లను కూడా వీరు సూపర్ ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లోనే శ్రీమంతుడు - జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్బస్టర్లు కొట్టిన ఈ సంస్థ ఆ తర్వాత రంగస్థలం - పుష్పతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఎవరికి లేనన్ని స్టార్ హీరోలు సినిమాలు ఈ సంస్థలో ఉన్నాయి. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్‌ భగత్ సింగ్ కూడా మైత్రి సంస్థ నిర్మిస్తోంది. ఇక రామ్ చరణ్ 16,  సుకుమార్ - రాంచరణ్ కాంబినేషన్లో వచ్చే సినిమాలను కూడా భారీ బడ్జెట్ తో ఇదే మైత్రి సంస్థ నిర్మిస్తోంది.


ప్రభాస్ - సీతారామం దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో ఫౌజీ సినిమా మైత్రి సంస్థ నిర్మిస్తోంది. రు . 300 కోట్ల బడ్జెట్ తో రెండవ ప్రపంచ యుద్ధం ఈ సినిమా తెరకెక్కుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెక్కించే రెండు భాగాల సినిమా కూడా మైత్రి సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రామ్ పోతినేని - మిస్ శెట్టి.. మిస్ట‌ర్ పోలిశెట్టి ద‌ర్శ‌కుడు మహేష్ బాబు. పి కాంబినేషన్లో వచ్చే రామ్ 22వ సినిమాను మైత్రి సంస్థ నిర్మిస్తోంది.


త‌మిళంలో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, హిందీలో గోపీచంద్ మ‌లినేని, స‌న్నీడియోల్ కాంబోలో జాట్ సినిమా... ప్ర‌శాంత్ వ‌ర్మ జై హ‌నుమాన్‌, నితిన్ - వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమాలు కూడా ఈ సంస్థే నిర్మిస్తోంది. ఇలాంటి లైన‌ప్ అస‌లు టాలీవుడ్‌లో ఏ సంస్థ‌కు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: