విక్టరీ వెంకటేష్.. ఈయన పేరు చెబితే తెలియని వాళ్ళు ఉండరు.. ది లెజెండరీ నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న దగ్గుబాటి రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీలోకి కలియుగ పాండవులు మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ సినిమాల్లోకి అనుకోకుండా వచ్చారట. మరి అలాంటి వెంకటేష్ సినిమాల్లోకి రావడానికి కారణం ఏంటి..ఆయన ఏం చదువుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..

 అమెరికాలో ఎంబీఏ:


 1960 డిసెంబర్ 13న ప్రకాశం జిల్లాలోని కారంచేడు లో జన్మించారు దగ్గుబాటి వెంకటేష్.. ఈయన తండ్రి అప్పటికే నిర్మాత కావడంతో చిన్నప్పటినుండే చాలా లగ్జరీగా పెరిగాడు. అలా స్కూల్ డేస్ నుండే లగ్జరీ లైఫ్ నీ అనుభవించిన వెంకటేష్ తన స్కూల్ చదువు మొత్తం మద్రాస్ ఎగ్మోర్ లోని డాన్ బాస్కో స్కూల్లో పూర్తయింది. ఇక స్కూల్ డేస్ పూర్తయ్యాక కాలేజీ కూడా మద్రాస్ లోని లయోలా కాలేజీలో బీకాం పూర్తి చేశారు. ఆ తర్వాత రామానాయుడు వెంకటేష్ ని పై చదువుల కోసం అమెరికా పంపించారు.అలా ఉన్నత చదువుల కోసం అమెరికాకి వెళ్లిన వెంకటేష్ మోన్టేరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఎంబీఏ చేసి ఎంబీఏ పట్టా పొందారు.ఇక అలా చదువుతున్న సమయంలోనే వెంకటేష్ కి సడన్గా సినిమాల్లో అవకాశం వచ్చింది.


అదెలా అంటే రామానాయుడు డైరెక్టర్ రాఘవేంద్రరావు,  కృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా తీయాలి అనుకున్నారు. అయితే సినిమాకి ఈ సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాక చివరికి కృష్ణ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. నాకు డేట్స్ ఖాళీగా లేవు అని చెప్పడంతో కాస్త అప్సెట్ అయినా రామానాయుడు ఎలాగైనా సరే ఈ సినిమా తీయాలి అని రాఘవేంద్రరావుతో ఈ సినిమా రావాలి అని నిర్ణయించుకొని వెంటనే తన కొడుకు వెంకటేష్ ని హుటాహుటిన ఇండియాకి పిలిపించి కలియుగ పాండవులు సినిమాలో నటించేలా చేశారట. సినిమాల మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేని వెంకటేష్ తండ్రి మాట కాదనలేక కలియుగ పాండవులు సినిమా తీశారట. ఇక 1996లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి వెంకటేష్ కి సినిమాల మీద ఆసక్తి పుట్టింది.అలా అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్ గా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: