తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పేరు పొందిన హీరో శర్వానంద్.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో కనబరిచి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే శర్వానంద్ అసలు పేరు శర్వానంద్ మైనేని.. కానీ తన పేరును శర్వానంద్ గా మార్చుకున్నారట. శర్వానంద్ తమిళ ,తెలుగు చిత్రాలలో అలరిస్తూ ఉన్నారు. 2004లో మొదటిసారి ఐదో తారీకు అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన శర్వానంద్ ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించారు.. శర్వానంద్ కెరియర్ మార్చిన చిత్రం గమ్యం. ఈ సినిమా తర్వాతే ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకొని పలు చిత్రాలలో నటించారు.


అయితే శర్వానంద్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే.. సికింద్రాబాద్లోని వెస్లీ డిగ్రీ కళాశాల నుంచి B.COM పూర్తి చేశారట.. టాలీవుడ్ లో శర్వానంద్ క్లాస్మేట్ ఎవరో కాదు దగ్గుబాటి రానా.. అయితే ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. అలాగే శర్వానంద్ ది హిందూ బెస్ట్ న్యూ ఫేస్ గా ఎన్నికయ్యారట. తన 17 ఏళ్ల వయసులోనే నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో చేరారట శర్వానంద్. శర్వానంద్ కు ఎన్నో వ్యాపార సంస్థలు ఉన్నప్పటికీ కూడా హీరో రామ్ పోతినేని కూడా దగ్గర బంధు అవుతారట.


2023లో శర్వానంద్ హైకోర్టు న్యాయం వాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డి తో వివాహం జరిగింది. వీరికి ఒక పండటీ పాప కూడా జన్మించింది. ప్రస్తుతం శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే చివరిగా మనమే అనే సినిమాలో నటించిన ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. కో అంటే కోటి అనే సినిమాకి కూడా నిర్మాతగా మారిన శర్వా నంద్ ఆ తర్వాత మరే సినిమాలను నిర్మించలేదు. ప్రస్తుతం తన 36 వ సినిమా 37 వ సినిమా కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: