చాలామంది సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మొదటి సినిమాతోనే ఫ్లాప్ అయినప్పటికీ కూడా తమ అందం, నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. అయితే అందులో కొంతమందికి మాత్రమే ఆ తర్వాత అవకాశాలు వెలబడుతూ ఉంటాయి. మరి కొంతమందిని మాత్రం దర్శక నిర్మాతలు అసలు పట్టించుకోరు. ఇప్పుడు అవకాశాలు రావడం అనేది కూడా చాలా కష్టమే.. అలాంటిది అవకాశాలు అందుకుంటున్న వారిలో రుక్మిణి వసంత్ కూడా ఒకరు..


ఒకానొక సమయంలో అల్లు అర్జున్ ,ప్రభాస్ వంటి హీరోల చిత్రాలలో ఆమెను తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. అలా అప్పట్లో ఆమె క్రేజ్ భారీగా ఉండేది. సప్తసాగరాలు దాటి అని ఒకే ఒక చిత్రంతో ఈమె భారీ పాపులారిటీ సంపాదించుకున్నది. తమిళంలో భారీ ఆఫర్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో పెద్ద సినిమాల కోసం వెయిట్ చేయకుండా నిఖిల్ నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలో నటించింది. ఈ సినిమా ఇటీవలే విడుదలై భారీ డిజాస్టర్ ని మూట కట్టుకుంది. దీంతో రుక్మిణి వసంత్ కి తెలుగులో అవకాశాలు రాకుండా చేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


చాలామంది మొదటి సినిమాతోని ఫ్లాప్ అయితే కచ్చితంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది.. కనీసం రెండు మూడు చిత్రాలు చేసి విజయాలు అందుకుంటేనే ఆ పేరు తొలగిపోయే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అలాంటిది రుక్మిణి పరిస్థితి కూడా ఏర్పడిందట. మరి ఐరన్ లెగ్ అనే పేరు పోతుందా లేకపోతే లక్కీ హీరోయిన్ గా పేరు మార్చుకుంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది. రుక్మిణి వసంత దగ్గరికి బడా హీరోల సినిమాల కథలు వెళ్లినప్పటికీ ఆమె కొంతమంది దర్శకులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. నిఖిల్ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ ఎలాంటి సినిమాతో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి రుక్మిణి వసంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: