శివ కార్తికేయన్ నటించిన 'అమరన్' సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా ఆయన కెరీర్‌లో మొదటి బ్లాక్‌బస్టర్. అంతేకాదు, ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని సాధించి రికార్డు సృష్టించింది. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న శివ కార్తికేయన్ ప్రముఖ దర్శకురాలు సుధా కొంగరతో కలిసి కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు 'పూర్ణనూరు' అనే పేరు పెట్టారు. ఈ మూవీ ఒక సామాజిక-రాజకీయ కథాంశం ఆధారంగా తెరకెక్కుతుందని తెలుస్తోంది. శివ కార్తికేయన్ ఇప్పటికే ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక సుధా కొంగర ఆకాశాన్ని హద్దురా, గురు లాంటి సినిమాలతో భారీ హిట్స్ సాధించింది. 'అమరన్' సినిమాతో కార్తికేయన్ కెరీర్‌కు మరో మైలురాయి చేరింది. ఇప్పుడు 'పూర్ణనూరు' సినిమాతో ఆయన మరోసారి అద్భుతమైన ప్రదర్శన ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

శివ కార్తికేయన్ నటిస్తున్న కొత్త సినిమా 'పూర్ణనూరు'లో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో ఇంకో ఇద్దరు ముఖ్యమైన పాత్రలు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో విలన్ పాత్ర చేయబోతున్నది విశాల్ అని వార్తలు వచ్చాయి. కానీ విశాల్ ఈ వార్తలను ఖండించారు. తాను ఇప్పుడు ఇంకో పెద్ద సినిమాలో బిజీగా ఉన్నానని, తనను విలన్ పాత్రలో చూడాలనుకునే అభిమానులు కొంచెం ఆగాలని కోరారు.

 'పూర్ణనూరు' సినిమాలో ఇంకో ఇద్దరు ముఖ్యమైన పాత్రల కోసం వెతుకుతున్నారు. తాజాగా ఈ రెండు పాత్రల కోసం జయం రవి, అథర్వా, రోషన్ మాథ్యూల పేర్లు వినిపిస్తున్నాయి. విశాల్ ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తారనే వార్తలు ఇంతకు ముందు వచ్చాయి కదా.. ఆయన ఈ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే, విశాల్ వదులుకున్న పాత్రను జయం రవి చేయొచ్చని కొందరు అంటున్నారు. కానీ ఇది ఇంకా ఖరారు కాలేదు. మరోవైపు, యువ నటుడు అథర్వా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, మలయాళ నటుడు రోషన్ మాథ్యూ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద ఈ సినిమా చాలా పెద్ద బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ప్రారంభంలో మొదలు కావచ్చు ప్రస్తుతానికైతే ఫ్రీ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: