రాధిక అంటే తెలుగు, తమిళ సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. ముఖ్యంగా చిరంజీవితో కలిసి 25 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించింది. వీరి జంట కలయిక ఆ రోజుల్లో ఎంతో ఫేమస్. ఆమె ఆ డేస్‌లో ఏడాదికి 10 నుంచి 20 సినిమాల్లో నటించేంత బిజీగా ఉండేది. నటనలో మాత్రమే కాకుండా, డాన్స్‌లో కూడా చిరంజీవికి గట్టి పోటీని ఇచ్చేది.

హీరోయిన్‌గా తన కెరీర్‌లో ఎంతో సక్సెస్ అయిన రాధిక, తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది. చాలా వరకు యంగ్ హీరోలకు తల్లిగా నటించింది. నటనతో పాటు, ప్రొడ్యూసర్‌గా కూడా సక్సెస్ అయింది. తన ‘రాదాన్ మీడియా’ ద్వారా ఎన్నో పాపులర్ సీరియల్స్, సినిమాలను నిర్మించింది. ప్రేక్షకులకు రాధిక సినిమా కెరీర్ గురించి తెలుసు కానీ, ఆమె వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియదు. రాధిక ప్రముఖ నటుడు ఎమ్.ఆర్. రాధాకు కుమార్తె. ఆమె మొదట నటుడు ప్రతాప్ పోతెన్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఆ వివాహం రెండేళ్లలోనే విడాకులతో ముగిసింది. తర్వాత రిచర్డ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం నుంచి కూడా రెండేళ్లకే విడిపోయింది.

దాదాపు పది సంవత్సరాలు తన కెరీర్‌పై దృష్టి పెట్టిన రాధిక, 2001లో నటుడు శరత్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. శరత్ కుమార్‌కు ఇంతకుముందు వరలక్ష్మి అనే కూతురు ఉంది. వరలక్ష్మి ప్రస్తుతం విలన్ పాత్రలకు డిమాండ్ ఉన్న నటి. రాధిక, శరత్ కుమార్ దంపతులకు రేయన్నే హార్డీ అనే కూతురు, రాహుల్ అనే కొడుకు ఉన్నారు. రేయన్నే హార్డీ 2016లో వివాహం చేసుకుంది. రాహుల్ ఇంకా చదువుకుంటున్నాడు.

రాహుల్ పెద్దవాడై సినిమాల్లో హీరోగా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇటీవల రాధిక, సరత్ కుమార్, వారి పిల్లలు కలిసి తీసుకున్న ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రాహుల్ సినిమాల్లోకి ఎంటరవుతాడా అనే చర్చ జరుగుతోంది. రాధిక తన కొడుకును సినిమాల్లోకి పరిచయం చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: