స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గంగోత్రి సినిమాతో అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. మొదట్లో అల్లు అర్జున్ సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అనంతరం సినిమాలన్నీ మంచి హిట్ అందుకున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప సినిమా భారీ విజయాన్ని అందించింది.


ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప2 సినిమా రాబోతోంది. పుష్ప2 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్ లో రిలీజ్ చేయనున్నారు. బిజినెస్ కూడా దేశవ్యాప్తంగా ఓవర్సీస్ లో భారీగా జరగడం విశేషం. ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి మంచి హిట్ తన ఖాతాలో వేసుకొనున్నాడు. ఇదిలా ఉండగా.... అల్లు అర్జున్ ఏం చదువుకున్నాడు అనే విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాడు. ఎమ్మెస్ ఆర్ కాలేజ్, హైదరాబాద్ లో పూర్తి చేసుకున్నాడు. అయితే.. చదువు పూర్తి కాగానే అమెరికాలో జాబ్‌ ఆఫర్‌ కూడా వచ్చిందట. కానీ కుటుంబాన్ని వదిలి వెళ్లడం ఇష్టం లేక ఆగిపోయాడట.  అనంతరం తన చదువును మానేసి వరుస పెట్టి సినిమాలలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ 2003లో హీరోగా పరిచయమయ్యాడు. గంగోత్రి సినిమాలో తాను హీరోగా చేసినందుకు మొదటిసారిగా రూ. 3500 రెమ్యునరేషన్ అందుకున్నాడు.


అనంతరం ఇప్పుడు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ నికర ఆస్తుల విలువ రూ. 354 కోట్లు. అల్లు అర్జున్ సినిమాలలో నటించి భారీగా డబ్బులను సంపాదించడమే కాకుండా పలు రకాల బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ భారీగా డబ్బులను సంపాదిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా...గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. ఇప్పుడు స్టార్‌ హీరో గా ఎదిగారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: