ఇలా చిన్నతనం నుంచే నటనపై ఉన్న ఆస్తితో చిరంజీవి నాటకల్లో అడుగుపెట్టి తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. డిగ్రీ తర్వాత 1976లో చెన్నై చేరుకున్నారు అక్కడ మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చిరు చేరారు అక్కడ నటనలో డిప్లమో పొందిన తర్వాత నటుడుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. టాలీవుడ్ సీనియర్ నిర్మాత జయకృష్ణ చిరంజీవిని తొలిసారిగా పునాదిరాళ్లు సినిమాలు అవకాశమిచ్చారు. తొలి రెమ్యూనిరేషన్ గా 1116 మెగాస్టార్ తీసుకున్నారు. చిరంజీవి నటించిన ఫస్ట్ పునాదిరాళ్లు అయినా ముందుగా రిలీజ్ అయింది మాత్రం ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అలానే కెరియర్ మొదట్లో చిరంజీవి విలన్ పాత్రలో కూడా నటించారు. అలా 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో చిరంజీవి హీరోగా నటించం మొదలుపెట్టారు. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆయన పేరు అందరికీ తెలిసింది. ఆ తర్వాత కే విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శుభలేఖ సినిమాలోనూ తన నటనతో మెప్పించి ఉత్తమ నటుడుగా తెలుగు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 1983లో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి రేంజ్ మారిపోయింది. సినిమా దగ్గర్నుంచి చిరంజీవి వెనక్కి తిరిగి చూసుకోకుండా టాలీవుడ్ లోనే మెగాస్టార్ గా ఎదిగి నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు. అయన తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ వంటి వారు కూడా స్టార్ హీరోలుగా ఎదిగి టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు.