తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఒక్క సారి ఎవరికైనా మాట ఇచ్చాడు అంటే ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళతాడు అనే గొప్ప మంచి పేరును కలిగి ఉన్నాడు. ఇలా ఒక దర్శకుడికి మాట ఇచ్చిన సందర్భంలో ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం తన సోదరుడు అయినటువంటి చిరంజీవి మాటను కూడా పవన్ కళ్యాణ్ లెక్క చేయలేదట. మరి అది ఏ విషయంలో అనేది తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , వీర శంకర్ దర్శకత్వంలో గుడుంబా శంకర్ అనే మూవీ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకోగలిగింది. ఇకపోతే ఈ సినిమా స్టార్ట్ కావడానికి ముందు చిరంజీవి ఒకసారి గుడుంబా శంకర్ కథను విన్నాడట. అది ఆయనకు పెద్దగా నచ్చలేదట. దానితో పవన్ తో ఆ కథతో సినిమా చేయకు , విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పాడట.


దానితో పవన్ కళ్యాణ్సినిమా విజయం సాధించిన , సాధించకపోయిన వీర శంకర్ తో ఓ సినిమా చేస్తాను అని మాట ఇచ్చాను. ఆయన ఓ కథను రెడీ చేసుకున్నాడు. మళ్లీ నేను వద్దంటే మాట తప్పినట్లు అవుతుంది. సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకున్న సంబంధం లేదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఆయనతో సినిమా చేస్తాను అన్నాడట. దానితో చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ మాటకు విలువ ఇచ్చాడట. ఇక పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం వీర శంకర్ తో గుడుంబా శంకర్ అనే సినిమా చేశాడు. ఆ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: