టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. ఇకపోతే తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా దిల్ రాజు కి మీకు ఏదైనా సినిమాల ద్వారా భారీ ఎత్తున నష్టాలు వచ్చాయా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు దిల్ రాజు సమాధానం ఇస్తూ ... నేను కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అజ్ఞాతవాసి సినిమా యొక్క డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేశాను.

సినిమా యొక్క డిస్ట్రిబ్యూషన్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేశాను. ఇక ఆ మూవీ ప్రేక్షకులను బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఆ సినిమా ద్వారా పెద్ద మొత్తంలో నాకు నష్టం వచ్చింది. ఇక అదే సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన స్పైడర్ మూవీ యొక్క థియేటర్ హక్కులను కూడా భారీ ధరకు నేను కొనుగోలు చేశాను. ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దానితో ఆ సినిమా ద్వారా కూడా నాకు పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అజ్ఞాతవాసి , మహేష్ బాబు హీరోగా రూపొందిన స్పైడర్ మూవీల ద్వారా ఒకే సంవత్సరం నాకు 25 కోట్ల మేర నష్టం వచ్చింది.

కానీ అదే సంవత్సరం నేను నిర్మించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. దానితో నేను నిర్మించిన సినిమాల ద్వారా వచ్చిన లాభాలను , నేను డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాల ద్వారా వచ్చిన నష్టాలతో పూడ్చాను. కేవలం నేను డిస్ట్రిబ్యూటర్ ను మాత్రమే అయ్యుంటే ఆ రెండు సినిమాలతోనే నేను పెద్ద మొత్తంలో లాస్ అయ్యేవాడిని. నేను నిర్మాతగా కూడా ఉన్నాను కాబట్టే ఆ నష్టాలను భరించగలిగాను అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: