ఈ వార్తలను ఎవరు ఖండించకపోవడంతో ఆల్మోస్ట్ కీర్తి సురేష్ పెళ్ళిని కన్ఫామ్ చేసేసుకున్నారు అభిమానులు. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 12వ తేదీ గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ డెస్టినేషన్ ను ప్లాన్ చేసుకున్నారట ఈ లవబుల్ లవర్స్ . అంతేకాదు సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ పెళ్లికి ఎవరు హాజరు కావడం లేదు అని కూడా తెలుస్తుంది . కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందట. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వబోతుందట .
అప్పుడే అందరి సినీ ప్రముఖులను ఇన్వైట్ చేస్తుందట . కాగా కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే డిసెంబర్ 12వ తేదీ మరో హీరోయిన్ నిశ్చితార్ధం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ బ్యూటీ మరెవరో కాదు తమన్నా. టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటి సంపాదించుకున్న తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తుంది . పెళ్లి అంటే మాత్రం దూరం గా ఉంటుంది ఈ జంట . అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా తమన్నా - విజయవర్మ లు సైతం పెళ్లి చేసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట . డిసెంబర్ 12వ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్ళ నిశ్చితార్ధం జరగబోతుందట . ముంబైలోనే వీళ్ల నిశ్చితార్ధం జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ఒకే దెబ్బకి రెండు పిట్టలు.. ఒకే మూమెంట్ కి ఇద్దరు హీరోయిన్స్ పెళ్లి అంటూ జనాలు ఓ రేంజ్ లో మాట్లాడేసుకుంటున్నారు..!