ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే హీరోయిన్ శోభిత - హీరో నాగచైతన్య పెళ్లికి సంబంధించిన మ్యాటర్ లే ఎక్కువగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నాయి.  కేవలం కొద్దిరోజులే మరి కొద్ది రోజుల్లోనే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల భార్యాభర్తలుగా మన ముందుకు రాబోతున్నారు . అఫ్కోర్స్ పెళ్లికి ముందే ఈ జంట భార్యాభర్తలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా ఏ ఎనార్ ఈవెంట్స్ లో శోభిత ధూళిపాళ్ళ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . పెళ్ళికి ముందే అక్కినేని ఇంటి కోడలి హోదాను  కట్టబెట్టేసాడు నాగార్జున . ఇక రీసెంట్గా జరిగిన ఐఫా అవార్డ్స్ లో చాలా స్పెషల్ గా కనిపించింది శోభిత.


అక్కినేని ఫ్యామిలీ  అంతా కూడా ఈ ఈవెంట్లో పాల్గొని సందడి చేసింది . అయితే అందరికన్నా హైలెట్ గా నిలిచింది మాత్రం శోభిత ధూళిపాళ్ళ అనే చెప్పాలి . చాలా ట్రెండీ అండ్ స్టైలిష్ గా అట్రాక్టివ్ గా కనిపించి అందరి అటెన్షన్ గ్రాబ్ చేసింది . అయితే ఇదే క్రమంలో నాగార్జున ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య - శోభిత  మ్యారేజ్ కి సంబంధించిన విషయాలను బయట పెట్టాడు . "అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వీళ్ల పెళ్లి జరుగుతూ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని.. అది మేము ఎప్పుడు స్టూడియో గా భావించలేదు అని .. మా ఇల్లు లాగే భావించామని .. నాన్నగారి ఆశీస్సులు ఎప్పుడూ అక్కడ ఉంటాయని ..అక్కడ పెళ్లి చేసుకుంటే నాగచైతన్య -శోభిత  లైఫ్ బాగుంటుంది .. నాన్న ఆశీస్సులు ఉంటాయని నమ్మే ఈ నిర్ణయం తీసుకున్నామని" చెప్పుకొచ్చారు .



అంతేకాదు "శోభిత  ఫ్యామిలీ మమ్మల్ని కోరింది ఒక్కటే ..పెళ్లిని చాలా ట్రెడిషనల్ గా చేయాలి అని ..అది మాత్రమే చెప్పింది .. మిగతా విషయాలన్నీ కూడా మీ ఇష్టమే అంటూ మాకు వదిలేసింది. నాకు కూడా ఆ మంత్రాలు వినాలని చాలా ఇష్టంగా ఉంది. ఆ మంత్రాలు వింటూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే తెలుగు సాంప్రదాయం ప్రకారం నాగచైతన్య -శోభిత  పెళ్లి జరిపించబోతున్నాం " అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు అక్కినేని నాగచైతన్య అదే విధంగా శోభిత ధూళిపాళ్ల పెళ్లికి సంబంధించిన డీటెయిల్స్ మారుమ్రోగిపోవడమే కాకుండా బాగా ట్రెండ్ అవుతున్నాయి . మరి కొద్ది రోజుల్లోనే ఈ జంటను మనం పెళ్లి బట్టలో చూడబోతున్నాం..అంటూ అక్కినేని ఫ్యాన్స్ కూడా ఇద్దరికీ కంగ్రాట్స్ అంటూ విషెస్ అందజేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: