మహిళల పైన అన్ని చోట్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని.. విషయం ఎలాంటిదైనా మన చేతిలోనే నిర్ణయం ఉంటుందని ఇందులో భాగంగా ఒకానొక సమయంలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని సైతం తెలియజేసింది.."గతంలో ఒక సినిమా షూటింగ్ సెట్లో ఒక హీరో తనతో చాలా ఇబ్బందికరంగా మాట్లాడారని.. తనకు ఏదైనా చాన్స్ ఉందా? అని అడిగారని వెంటనే తన చెప్పుల సైజు 41 అక్కడే చెంప పగలగొట్టనా లేకపోతే సెట్లో అందరి ముందు పగలకొట్టనా అని అడిగానని తెలియజేసింది ఖుష్బూ..
సినిమా మాధ్యమంగానే ప్రేక్షకులను అలరించడానికి తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను సమానత్వం, గౌరవంలో ఎక్కడ రాజీ పడేది లేదు అంటూ తెలిపింది.. ఆ హీరో ఎవరైనా సరే మాట్లాడుతాను హేమ కమిటీ రిపోర్ట్ ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన తర్వాత మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు బహిర్గతమయ్యాయని వారు ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులు వేధింపులు అన్నీ కూడా ఆ రిపోర్టులో తెలియజేసిందట ఖుష్బూ.తనతో పాటుగా ఎంతోమంది నటీమణులు కూడా తమకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పలేకపోతున్నారని తెలిపింది. ఇండస్ట్రీలో మహిళల సంరక్షణ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది అంటూ తెలిపింది ఖుష్బూ. మనకి నచ్చనిది జరుగుతున్నప్పుడు వాటికి నో చెప్పడం తెలియాలని పిలుపునిస్తున్నామంటూ తెలిపింది ఖుష్బూ.