అయితే రాజమౌళి ఈ స్థాయిలో ఇంత పాపులర్ కావడానికి ముఖ్య కారణం ఆయన భార్య రామా అని కూడా అంటారు. రమా ఎప్పుడూ తన భర్తకు ఎంతో సపోర్టుగా నిలుస్తారు. ప్రధానంగా రాజమౌళి భార్య రమా డిజైన్ చేసే కాస్ట్యూమ్స్ ఆయన సినిమాల్లో హైలెట్గా ఉంటాయి. ఇక రాజమౌళి రమాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళిని పెళ్లి చేసుకునే ముందే రమాకు మరో వ్యక్తితో పెళ్లి జరిగి కార్తికేయ జన్మించాడు. వారికి మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
అయితే రాజమౌళి కూడా తాను చదువుకునే రోజుల్లో ఓ స్టార్ హీరోయిన్ ని ఎంతో గాఢంగా ప్రేమించారట. అలాగే ఆ హీరోయిన్ కోసం రాత్రులు కూడా కాలేజీ గోడలు కూడా దూకి మరి ఆమె ఇంటి చుట్టూ తిరిగేవారట. అలాగే ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నా రాజమౌళి కానీ తన ప్రేమ విషయాన్ని మాత్రం ఆమెకు చెప్పే ధైర్యం చేయలేదట. లైఫ్ లో సెటిల్ అయ్యాక ఆమెకు తన ప్రేమ విషయం చెబుదామని అనుకున్నారట. కానీ ఆలోపే ఆ హీరోయిన్ కి వేరే వ్యక్తితో పెళ్లి జరిగిపోయింది. దీంతో హర్ట్ అయిన రాజమౌళి అసలు పెళ్లే చేసుకోకూడదని అనుకున్నారట. ఆ తరువాత మరోసారి రమని చూడగానే మళ్లీ ప్రేమపై ఇంట్రెస్ట్ వచ్చిందట. అప్పటికే పెళ్లి అయి ఓ బిడ్డ ఉన్నప్పటికీ రమకు లైఫ్ ఇచ్చారట.