అయితే కీర్తి సురేష్ ఆ ట్రోలింగ్ ను ఏ మాత్రం పట్టించుకోలేదు . తనకు నచ్చిన సినిమాలను ఇష్టంగా కమిట్ అయిపోయింది . కాగా కీర్తి సురేష్ పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ వైరల్ గా మారిపోయింది . కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టీల్ ను గోవాలో డిసెంబర్ 12వ తేదీ పెళ్లి చేసుకోబోతుంది అంటూ తండ్రి కూడా అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసాడు. వీళ్ళ పెళ్లి పనులకు సంబంధించిన ప్రాసెస్ చక చక ముందుకు వెళ్ళిపోతుంది. అయితే ఈ పెళ్లికి సినీస్టార్స్ ఎవరు కూడా హాజరు కావడం లేదు అంటూ తెలుస్తుంది . కాగా కీర్తి సురేష్ ఆగస్టు 14వ తేదీ నిశ్చితరధం చేసుకుందట .
అయితే ఆ విషయాన్ని గుట్టూ చప్పుడు కాకుండా దాచిందట. పెళ్లి విషయానికి కూడా ఎవరికీ చెప్పాలి అనుకోలేదట. చాలా సింపుల్గా పెళ్లి చేసేసుకొని ఆ తర్వాత ఆ విషయాన్ని బయట పెట్టాలి అనుకుందట . కానీ గోవాలో రిసార్ట్ బుక్ చూస్తున్నా మూమెంట్లో ఆ విషయం అక్కడున్న తెలుగు వాళ్ళకి లీక్ అవ్వడంతో అది అలా అలా తెలుగు మీడియాలో లీకై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ఆమె పెళ్లి వార్త మారుమ్రోగి పోయేలా చేసేసింది అన్నట్లు తెలుస్తుంది.
అంతేకాదు కీర్తి సురేష్ పెళ్లి ని సీక్రెట్ గా దాచడానికి ఆమెకి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కారణం అంటూ తల్లి బంధువుల వద్ద చెప్పుకొచ్చిందట . బంధువులకు కూడా చెప్పకుండా ఇంత సీక్రెట్ గా పెళ్లి చేయడం ఎందుకు ..? అంటూ కీర్తి సురేష్ రిలేటివ్స్ నెగిటివ్ గా మాట్లాడుతున్న మూమెంట్లో కీర్తి సురేష్ తల్లి మేనక అసలు విషయాన్నీ బయటపెట్టిందట . కీర్తి సురేష్ కమిట్ అయిన సినిమాలు అదే విధంగా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే ఆమె పెళ్లి సీక్రెట్ గా దాచాల్సి వచ్చింది అంటూ క్లారిటీ ఇచ్చిందట. కీర్తి సురేష్ మరోసారి ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అయిపోతుంది..!