టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ అవతారంలో బాక్సాఫీస్ ను ఏలేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఎవరు ఊహించిన రీతిలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరో రెండు వారాల్లో పుష్పగాడి రూల్ ధియేటర్లలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పుష్ప ఎన్ని కాసులు వెనకేసుకొస్తాడు అనే చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైప్ చూస్తుంటే సరికొత్త చరిత్రకి కొత్త అధ్యాయం కానున్నట్టు అనిపిస్తుంది. ఇంతకీ ఈ సినిమా రాజమౌళి - కేజిఎఫ్ సినిమాల రికార్డులను బ్రేక్ చేయగలుగుతుందా .. అలా చేయాలంటే ఏం జరగాలి అనేదానిపై రకరకాల చర్చలు సినిమా వర్గాలలో వినిపిస్తున్నాయి.
పుష్ప సినిమాలో ఏ బిడ్డ ఇది నా అడ్డ అనే సాంగ్ లోని లిరిక్స్ ప్రస్తుతం అల్లు అర్జున్‌కు సరిగ్గా సూట్ అయ్యేలా అనిపిస్తున్నాయి. ఒకవైపు సోషల్ మీడియాలో ఆయనపై ఎంత నెగెటివిటీ ఉన్న వాస్తవానికి సినీ విశ్లేషకులకు నిర్మాతలకు పుష్ప గాడి రేంజ్ ఏంటో అర్థమయిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా హిందీ రైట్స్ హిందీలో అనిల్ తడాని కొని భారీ రేంజ్ లో రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాకు పోటీగా నిలుస్తుంది అనుకున్న చావా సినిమా కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో పుష్ప 2కు బాలీవుడ్లో సోలో రిలీజ్ లభించింది. రు. 300 నుంచి 400 కోట్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ ఇతర రాష్ట్రాల నుంచి 600 నుంచి 700 కోట్లు గ్రాస్ ఈజీగా వస్తుందని అంటున్నారు. ఇక సూపర్ హిట్ టాక్ వస్తే ఈ కోట్ల రికార్డు కొట్టడం చాలా సులభం. బ్లాక్ బస్టర్ అయితే ఊచకోతే అంటున్నారు. ఫాంటసీ గ్రాఫిక్స్ లేని ఒక మాస్ కమర్షియల్ సినిమా ఇన్ని రికార్డులు క్రియేట్ చేయడం అంటే అంత సులభం కాదు .. కానీ పుష్ప మానియా చూస్తే సాధ్యమే అనిపించేలా ఉంది. ఇటీవల రిలీజ్ అయిన దేవర సినిమా హిట్ అయినా డోస్ సరిపోలేదు. అంతా కరెక్ట్ గా జరిగితే పుష్ప వెయ్యి కోట్ల మైలు దాటేసి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే రాజమౌళి - కేజిఎఫ్ రికార్డులను కూడా టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.