దీంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా.... రామ్ చరణ్ అయ్యప్ప మాలను ధరించారు. అయ్యప్ప మాల వేసుకుని ఏపీలోని కడప దర్గాను సందర్శించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా హిందూ సమాజం, అయ్యప్ప భక్తులు రామ్ చరణ్ ఇలా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉండి ఇలా చేయడం పెద్ద తప్పు అని హిందూ సమాజం ఆగ్రహిస్తోంది.
రామ్ చరణ్ వెంటనే అయ్యప్ప స్వామి మాలను తొలగించి స్వామివారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయ్యప్ప భక్తులకు, హిందూ సమాజానికి కూడా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో స్పందించడం జరిగింది. దేవుడి మీద విశ్వాసం అందరిని ఒక్కటి చేస్తుందని చిన్న భిన్నం చేయదు అని పేర్కొన్నారు. భారతీయులంతా అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తారని ఐకమత్యంలోనే బలం ఉందని ఉపాసన వెల్లడించారు.
అయితే అల్లు అర్జున్ కుట్రలు చేసి అయ్యప్ప స్వాములను ఇలా రెచ్చగొడుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య ఏవో కొన్ని గొడవల కారణంగానే అల్లు అర్జున్ హిందూ సమాజాన్ని, అయ్యప్ప భక్తులతో కలిసి కుట్రలు చేస్తూ వారిని రెచ్చగొట్టి ఇలా చేయిస్తున్నాడంటూ సోషల్ మీడియా కోడైపోస్తోంది. ఇక ఈ వార్తలలో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.