టాలీవుడ్‌ స్టార్‌, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి తెలియని వారంటూ ఉండరు. సినీ ఇండస్ట్రీలోనే ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది టాలీవుడ్‌ స్టార్‌, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. "శ్రీ" అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది హ్యాపీడేస్ సినిమాతో ఎనలేని గుర్తింపు సంపాదించుకుంది. ఆ సినిమా అప్పట్లో యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. హ్యాపీడేస్ సినిమా ఇప్పటికీ టీవీలలో వస్తే చూసేవారు ఎంతోమంది ఉన్నారు.


హ్యాపీడేస్ సినిమా అనంతరం ఇప్ప టివరకు వెనుతిరిగి చూసుకోకుండా వరుస పెట్టి సినిమాల్లో చేసుకుంటూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది టాలీవుడ్‌ స్టార్‌, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. అంతే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు కావడం విశేషం. తెలుగుతో పాటు హిందీ తమిళంలో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


ఓ వైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్ లలోను నటిస్తూ బిజీగా ఉంటుంది. అంతేకాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో తన సత్తాను చాటుకుంటుంది. గత కొన్ని రోజుల నుంచి తమన్న వ్యక్తిగత విషయాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి పెళ్లెప్పుడు అనే ప్రశ్నకు ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు.


కానీ ఇప్పుడుటాలీవుడ్‌ స్టార్‌, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, విజయ్ 2025లో వివాహం చేసుకోబోతున్నారని బాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ జంట తమ పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ముంబైలో ఓ ఖరీదైన అపార్ట్మెంట్ కోసం వెతుకుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చాలామంది సినీ సెలబ్రిటీలు ముంబైలోని బాంద్రాలో సీఫేసింగ్ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసుకున్నారు. అదే దారిలో తమన్నా, విజయ్ వర్మ కూడా పయనిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక వీరి వివాహం ఎప్పుడు అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: