బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ భారతదేశం గర్వించదగ్గ స్టార్‌గా ఎదిగారు. బహుముఖ నటుడుగా బిగ్ బి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అయితే, తన కుటుంబం గురించి నిత్యం కలవరం కలిగించే వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన కుటుంబంపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బిగ్ బి విసుగు చెందారు. గత కొన్ని నెలలుగా తన కొడుకు, కోడలు విడిపోయారంటూ ప్రచారం చేస్తున్న మీడియాపై అమితాబ్ బచ్చన్ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్ (ఐష్) విడిపోతున్నట్లు మీడియాలో పుకార్లు వచ్చాయి. ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలో ఇద్దరూ విడివిడిగా కనిపించరు కూడా.

అయితే, బచ్చన్ కుటుంబం అన్ని ఊహాగానాలపై గౌరవప్రదంగా మౌనం వహించింది. కానీ, అమితా బచ్చన్ చివరకు తన తాజా బ్లాగ్ పోస్ట్‌లో వీటన్నింటిని ప్రస్తావించారు. ఆయన కొన్ని రహస్యమైన అభిప్రాయాలను పంచుకున్నారు. దీని గురించి ఒక లాంగ్ నోట్ కూడా విడుదల చేసారు. ఈ ఊహాగానాల వెనుక ఉన్న నిజం గురించి ఆయన స్పష్టం చేశారు. నేను నా కుటుంబం గురించి మాట్లాడటం చాలా తక్కువ. ఎందుకంటే, అది నా సొంత డొమైన్. మా కుటుంబం గోప్యతను నేను కాపాడే ప్రయత్నం చేస్తాను, అవన్నీ ధ్రువీకరణ లేకుండా ఊహాజనిత అవాస్తవాలు మాత్రమే అంటూ ఆయన తెలిపారు.

ప్రొఫెషనల్ మీడియా వ్యాపారంలో ఆమె ఎంచుకున్న కెరీర్‌లో కొనసాగాలనే వారి కోరికను నేను  సవాలు చేయను. సమాజానికి సేవ చేయడానికి వారి ప్రయత్నాలను మేము అభినందిస్తున్నాము. అయితే ఫేక్ న్యూస్, అనుమానం, ఊహాగానాలు సరికాదన్నారు. ఇంకా, అమితాబ్ బచ్చన్ సందేహాల బీజాన్ని నాటలేదు. దానిని విశ్లేషించమని పాఠకులను అడగలేదు. ముఖ్యంగా క్వశ్చన్ మార్క్ తో ఏదైనా రాస్తే హేళన చేశారు. ఇలాంటి ప్రకటనలు చేసే వారికి మనస్సాక్షి ఉంటుందన్నారు. మొత్తానికి అమితాబ్ బచ్చన్ తన కొడుకు విడాకుల వార్తలపై స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాకపోతే, ఆయన నటించిన ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. “ఐ వాంట్ టు టాక్” నవంబర్ 22న రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: