మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సినీ కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సత్యదేవ్, పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించారు. ముఖ్యంగా సత్యదేవ్ సరైన సక్సెస్ అందుకోలేక సతమతమవుతున్నారు. ఇటీవల భారీ అంచనాల మధ్య జీబ్రా అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కన్నడ నుంచి రీమిక్స్ చేయడం జరిగింది. ఈ థ్రిల్లర్ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇందుకు సంబంధించిన రివ్యూ ని ఇప్పుడు ఒకసారి చూద్దాం


జీబ్రా సినిమా తెలుగులో సునీల్-సత్య వంటి వారు నటించారు. ఇందులో సూర్య పాత్రలో (సత్యదేవ్) బ్యాంకు ఉద్యోగి. బ్యాంకింగ్ సిస్టంలో అన్ని కూడా తెలిసిన తర్వాత ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ లొసుగులను ఉపయోగించుకొని వాటి నుంచి బయటపడుతూ ఉంటాడట. సూర్య ప్రేమించిన అమ్మాయి (ప్రియా భవాని శంకర్) కూడా మరొక బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఆమె పొరపాటున నాలుగు లక్షల రూపాయలు ఇతర అకౌంట్ లోకి వెళ్ళిపోతే. ఆ తర్వాత సూర్య ఆ డబ్బులను వెనక్కి తీసుకువచ్చేలా చేస్తారు. సూర్య తొక్కిన ఆ అడ్డదారి చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత మాఫియా డాన్ ల చేతుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా ఇంకా సమస్యలలో కూరుకుపోతారు. దీని నుంచి బయట ఎలా పడతారు అనేది మిగతా కథ.


ఇటీవలే దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ అనే చిత్రంతో  పోలుస్తూ.. జీబ్రా సినిమా ట్రైలర్ ఉన్నప్పటికీ ఆ దరిదాపుల్లో కూడా నిలవలేకపోయిందని నెటిజన్స్ తెలుపుతున్నారు. చాలా పాత్రలు ఇందులో పెట్టేసి అలాగే లేయర్లుగా కథలను తయారు చేసుకున్నప్పటికీ ఎందుకో కథ కుదరలేదని  ప్రేక్షకులు సహనానికి ఇదొక పరీక్ష అన్నట్లుగా తెలుపుతున్నారు. ఈ జీబ్రా సినిమా అంత సులువుగా అర్థమయ్యే కథ కాదు అని, చివరి వరకు ప్రేక్షకులకు చాలా అందరూ గోళం సృష్టిస్తుందని తెలుపుతున్నారు. డైరెక్టర్ నరేట్ కొన్ని పాత్రలు, సీన్లు,  అసలు కథతో సంబంధం లేదని అయోమయంలో పడేసేలా ఉంటుందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. అలాగే చివరిలో కొంతమేరకు కథ ఆసక్తికరంగా కనిపించినా అంతకుముందు సృష్టించినటువంటి సినిమా స్టోరీ గందరగోళం వల్ల పెద్దగా అనిపించలేదట.


సూర్య పాత్రలో సత్యదేవ్ బాగా నటించినప్పటికీ ఆ తర్వాత ప్రియా భవాని శంకర్ కూడా పరవాలేదు అనిపించుకున్నది. డాలి ధనుంజయ పాత్రలో కూడా బాగానే ఆకట్టుకున్నది. ఈ సినిమాకి కామెడీ పెద్ద రిలీఫ్ ఇచ్చిందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఇందులో సునీల్ కూడా వెరైటీగా విభిన్నమైన పాత్రలో కనిపించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: