Iffa వేడుకలు గోవాలో ఇటీవలే జరుగుతున్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా ఇక్కడికి చాలామంది సినీ సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు. అలా టాలీవుడ్ నుంచి ఎంతమంది హాజరైనప్పటికీ అక్కినేని కుటుంబ సభ్యులు కూడా అక్కడ సందడి చేయడం జరిగింది. ఈరోజు జరిగిన చర్చలో భాగంగా డాల్బీ టెక్నాలజీకి సంబంధించి అక్కినేని నాగార్జున పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ టెక్నాలజీకి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా తన ఏఎన్నార్ స్టూడియోలో ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు నాగార్జున.


ముఖ్యంగా డాల్బీ విజన్లో rrr సినిమాని రూపొందించాలనుకున్నప్పుడు రాజమౌళి ఇండియాని వదిలి జర్మనీకి వెళ్లడం జరిగిందని ఈ పనులు అక్కడికి వెళ్లి పూర్తి చేసుకున్నారని అయితే ఈ టెక్నాలజీ ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడానికి మేము నిర్ణయించుకున్నాము అందుకే డాల్బీ సినిమా అని స్టూడియోలో ఏర్పాటు చేశామని తెలిపారు నాగార్జున.. అందుకే పుష్ప-2 సినిమాతోనే దానిని మేము ప్రారంభించాము అంటూ తెలిపారు. ఇదే ఇండియాలో తొలిసారి కావడం చేత చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు నాగార్జున. సినిమా ప్రేమాణలు పెంచి ప్రేక్షకులను సైతం సరికొత్త అనుభూతితో  పొందేందుకే ఈ డాల్బి విజన్ ఉపయోగపడుతుందని తెలిపారు. అది కూడా పుష్ప-2 సినిమాతో అని తెలిసి అభిమానులు సంబరపడుతున్నారు.


ఈ కార్యక్రమం అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ..IFFA వేదిక సినీ పరిశ్రమకు చెందిన చాలామంది గొప్ప వ్యక్తులను సైతం ఇక్కడ స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉందని ముఖ్యంగా తన తండ్రి ఏఎన్ఆర్ నటించిన దేవదాసు సినిమా ఎవర్ గ్రీన్ గా మిగిలిపోయిందని తెలిపారు. ఏఎన్ఆర్ చిత్రాలలో మీ కుమారులు ఏదైనా రీమేక్ చేస్తే బాగుంటుందని అడగగా.. అందుకు నాగార్జున సమాధానం తెలియజేస్తూ రీమేక్ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు అంటూ సరదాగా నవ్వుతూ తెలియజేశారు. అలాగే నాగచైతన్య, శోభిత వివాహానికి సంబంధించి పనులైతే జరుగుతున్నాయని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: