అయితే తాజాగా వాటిపై మోహిని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తెలిపింది. రెహమాన్‌తో బంధం వార్తలను పరోక్షంగా మాట్లాతూ . ఈ నేపథ్యంలో తనతో ఇంటర్వ్యూల కోసం వచ్చిన పలు అభ్యర్థనలను తాను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు ఆమె తెలియచేసింది. అనవసరమైన, నిరాధార పుకార్లపై తన శక్తిని వెచ్చించబోనని మోహిని స్టోరీ లో తెలిపింది. అలాగే "ఇంటర్వ్యూలు కావాలంటూ భారీగా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఎందుకో నాకు తెలుసు. ఈ చెత్తకు ప్రచారమివ్వాలన్న ఆసక్తి ఏమాత్రం లేదు. నా శక్తిని రూమర్లపై పెట్టదలచుకోలేదు. దయచేసి నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి" అని మోహిని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో అందరికి తెలియచేసింది.
ఇది ఇలా ఉండగా గతంలో రెహమాన్ కుమారుడు అమీన్ కూడా బాసిస్ట్ మోహిని డేతో తన తల్లిదండ్రులు విడిపోవడాన్ని కలిపే నిరాధార పుకార్లపై ఫైర్ అయ్యడు. అలాగే రెహమాన్ కుమార్తె రహీమా కూడా ఇదే విషయమై తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఎలాంటి పనీపాటాలేని వారే ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రచారం చేస్తారు అని ఆమె ఫైర్ అయ్యారు. అలాగే ఈ విడాకుల వార్త పై సైరా తరఫు న్యాయవాది వందనా షా కూడా మాట్లాడుతూ ఆ కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం తెలిపారు. ‘ఈ రెండు జంటల విడాకులకు ఎలాంటి సంబంధం లేదు. పరస్పర అంగీకారంతో సైరా- రెహమాన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వివాహ బంధంలో సైరా వ్యక్తిగతంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. వారిద్దరూ విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి’ అని న్యాయవాది వందనా షా స్పష్టంగా తెలిపారు.