అలాగే ఈ సీనియర్ హీరో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎప్పుడు రెడీ గానే ఉంటారు. పాత తరం హీరోలను పక్కన పెడితే ఆయన ఈతరం హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్న మొదటి హీరో వెంకటేష్ .. ఇప్పటికే మహేష్‌తో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, నాగా చైతన్యతో వెంకీ మామ , వరుణ్ తేజ్ తో ఎఫ్2 , ఎఫ్3 సినిమాలు చేసి మంచి విజయం అందుకున్నారు. అయితే గతంలో మరో మల్టీస్టారర్ కూడా చేతులు దాకా వచ్చి మిస్సయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి ? ఆ హీరో ఎవరు అనేది ఇక్కడ చూద్దాం.
ఇక టాలీవుడ్ సీనియర్ హీరోలలో రాజశేఖర్ కూడా ఒకరు .. గతంలో రాజశేఖర్ , వెంకటేష్ తో ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా చేయాలనుకున్న దర్శకుడు మరెవరో కాదు తేజ .. వెంకటేష్ గురు సినిమా తర్వాత ఆయనతో ఓ సినిమా ప్లాన్ చేశారు.. సురేష్ ప్రొడక్షన్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని తెర్కక్కించాలనుకున్నారు . అయితే ఇందులో ఒక కీలక పాత్ర కూడా ఉంది .. చాలా బలమైన ఆ పాత్రలో రాజశేఖర్ ని అనుకున్నారు. అయితే ఆయన కంటే ముందు చాలా మంది హీరోల పేర్లు అనుకున్నారో నాగచైతన్య , రానా , మాధవన్ పేర్లు కూడా మధ్యలో వినిపించాయి . కానీ దానికి రాజశేఖర్ అయితే బాగుంటుందని దర్శకుడు తేజ భావించారు.
అలాగే దర్శకుడు తేజ , రాజశేఖర్ కలిసి కథ కూడా చెప్పారు .. ఆయన కూడా సినిమా చేయడానికి ఓకే అన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆట నాదే వేట నాదే అనే టైటిల్ని కూడా సినిమాకు ఖరారు చేశారు. అధికార ప్రకటన వస్తుంది అనుకున్నారు .. కానీ సడన్గా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అల వెంకటేష్ , రాజశేఖర్ కలిసి నటించాల్సిన సినిమా రాలేదు . అయితే ఇందులో వెంకటేష్ బామ్మర్ది గా, రాజశేఖర్ బావగా నటించాల్సి ఉంది . ఈ సినిమా సెట్ అయితే ఇద్దరూ బావ , బావమరిది అయ్యో వాళ్ళు కానీ కొద్ది ఛాన్స్ లో మిస్ అయింది . సినిమా కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక క్రేజీ సినిమాగా నిలిచేది కానీ జస్ట్ లో సినిమా ఆగిపోయింది.