తమిళంలో అగ్ర హీరోగా పేరు సంపాదించిన హీరోలలో జయం రవి కూడా ఒకరు.. ఇటీవలే తన భార్య నుంచి విడాకులు తీసుకోబోతున్నారనే ఒక ప్రకటన చేయడంతో మరొకసారి తెరమీదకి జయంరవికి సంబంధించిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈయన చిత్రాలు అటు తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తూ విడుదల చేస్తూ ఉన్నారు. అయితే జయంరవి అన్నయ్య మోహన్ రాజా కూడా కోలీవుడ్లో డైరెక్టర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో చిరంజీవితో గాడ్ ఫాదర్, హనుమాన్ జంక్షన్ వంటి చిత్రాలను తెరకెక్కించారట.


జయం రవి ,మోహన్ రాజాల తండ్రి ఎడిటర్ మోహన్ గా తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. తెలుగులో స్టార్ హీరోల చిత్రాలకు ఈయన ఎడిటర్ గా పనిచేశారట. అసిస్టెంట్ ఎడిటర్ గా తన సినీ కెరీర్ ని ప్రారంభించిన మోహన్ సీనియర్ ఎన్టీఆర్ నటించిన విఠలాచార్య, గురువును మించిన శిష్యుడు అనే చిత్రాలకు అసిస్టెంట్ ఎడిటర్ గా మోహన్ చేశారట. తెలుగులో నవగ్రహపూజమహిమ, చిక్కడు దొరకడు, అగ్గిపిడుగు, హనుమాన్ జంక్షన్ తదితర చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశారట.


ఎడిటర్ గా పనిచేసిన అనుభవంతో ఈయన ప్రొడ్యూసర్ గా కూడా మారారట. తెలుగు సినిమాలను చేయగా ఆ తర్వాత తమిళ సినిమాలను తెలుగులోకి డబ్ చేసి మంచి విజయాలను అందుకున్నారు. సుమారుగా 60 డబ్బింగ్ చిత్రాలను ప్రొడ్యూసర్ చేశారట. మోహన్ చాలా వరకు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు హిట్ అవుతూ ఉండేవట. వరుస ప్లాపులతో సతమతమవుతున్న చిరంజీవికి హిట్లర్ సినిమాతో మంచి విజయాన్ని అందించారు. అలాగే సుమన్ ,కృష్ణంరాజు కాంబినేషన్లో వచ్చిన బావ బావమరిది సినిమాతో పాటు, మామగారు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి తదితర తెలుగు చిత్రాలను ప్రొడ్యూసర్ గా చేశారట. అలాగే బావ బావమరిది, క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా మోహన్ పని చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: