ఇక నాగచైతన్య - సమంత జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో నాగా చైతన్య క్రేజ్ కూడా పెరిగింది. అలాగే ఏం మాయ చేసావే సినిమా తర్వాత నాగచైతన్యకు అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన 100% లవ్ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్నాడు నాగా చైతన్య .. ఇప్పటివరకు 28 పైగా సినిమాల్లో నటించి మెప్పించారు .. ఇక నాగచైతన్య వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏం మాయ చేసావే సినిమా సమయంలో ప్రేమలో పడిన ఈ జంట చాలా కాలం ప్రేమించుకున్నారు.
2017 అక్టోబర్ 7న వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది.. అయితే పెళ్లియిన కొన్ని సంవత్సరాలకే మనస్పర్ధలు రావడంతో 2021 లో విడాకులు తీసుకున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగా చైతన్య వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీ అయిపోయారు తర్వాత అక్కినేని హీరో మరో స్టార్ హీరోయిన్ శోభీత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డారు. ఎవరికీ తెలియకుండా కొన్ని రోజులు డేటింగ్ చేసిన ఈ జంట గత ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. వచ్చే డిసెంబర్ 4 నాగచైతన్య - శోభిత దూళిపాళ్ల పెళ్లి ఎంతో ఘనంగా జరగబోతుంది. నాగచైతన్య కూడా ప్రస్తుతం చందు మొండిటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాని నాగచైతన్య కెరీర్ లోని అత్యంత భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానన్నారు. అలాగే నాగచైతన్య తన తర్వాత సినిమాని కూడా విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ దండుతో తన తర్వాత సినిమాను ప్రకటించాడు. ఇలా వరుస సినిమాలతో నాగచైతన్య ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.