గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో తెలుగు సినిమా ‘హను-మాన్’ చిత్రం ప్రదర్శించారు. ఇది ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంజనాద్రి అనే ఒక కల్పిత గ్రామాన్ని నేపథ్యంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ఈ గ్రామంలో నివసించే చిన్న దొంగ హనుమంతు, అనుకోకుండా శ్రీ హనుమంతుడి రక్తపు బిందువును తాకి దైవిక శక్తులను పొందుతాడు. ఈ శక్తులతో అతను స్వయంగా సూపర్ హీరో అని చెప్పుకునే వ్యక్తితో భీకర యుద్ధానికి దిగుతాడు. పురాణాలు, మనిషి పట్టుదల వంటి అంశాలను కలిపి ఈ చిత్రం తెరకెక్కింది.

‘హను-మాన్’ సినిమాలో హనుమంతు పాత్రను పోషించిన నటుడు తేజ సజ్జ భారతీయ పురాణాల ఆధారంగా రూపొందించిన పాత్రను చాలా బాధ్యతతో పోషించాలని చెప్పాడు. తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినప్పటికీ, భారీ బడ్జెట్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ పెట్టారు అందువల్లే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. హైదరాబాద్‌లో అంజనాద్రి అనే గ్రామాన్ని పూర్తిగా సెట్‌లో నిర్మించడం ద్వారా వారి క్రియేటివిటీని ప్రదర్శించారు.

అయితే తేజ సజ్జ ఈ ఫిలిం ఫెస్టివల్ లో మాట్లాడుతున్న సమయంలో ఒక సీనియర్ సిటిజన్ స్టేజ్ మీదకి వచ్చాడు అంతే కాదు ఈ యువ హీరో కాళ్లపై పడిపోయాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే తేజ సజ్జ ఆ ముసలాయన్ని లేపాడు. యువ హీరోనే నిజమైన హనుమంతుడు అని ఆ ముసలి వ్యక్తి భావించినట్లు ఉన్నాడు. అందుకే అలా తేజ సజ్జ కాళ్ళు మొక్కాడు. కానీ ఈ నటుడు మాత్రం తన కేవలం యాక్టర్ మాత్రమేనని నాకు మీరు దండం పెట్టడం ఏంటి అని ముసలాయనతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మసినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డారని తేజ సజ్జ ప్రశంసించారు. భారతదేశపు పురాణాలను ఆధునిక కథన శైలితో కలిపి ఈ చిత్రం తెరకెక్కిందని వివరించారు. ఈ సినిమా భారతీయ ప్రేక్షకులను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలనేది వారి లక్ష్యమని తెలిపారు. ఈ సినిమాకి సీక్వెల్ గా ఒక పెద్ద సినిమా చేయబోతున్నామని కూడా అతని తెలిపాడు. ఫిమేల్ క్యారెక్టర్స్ కి ఒక అర్థం ఉండేలాగా హనుమాన్ సీక్వెల్ సినిమాలో చూపిస్తామని పేర్కొన్నాడు.





మరింత సమాచారం తెలుసుకోండి: