తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కమెడియన్లు ఉన్నారు. వారందరిలో ఎవరికి వారు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని ఉన్నారు. అలాంటి వారిలో గుండు హనుమంతరావు ఒకరు. ఈయన చాలామంది స్టార్ కమెడియన్లకు అసిస్టెంట్ క్యారెక్టర్లు చేస్తూ ఎంతోమందికి నవ్వులు తెప్పించారు. అలాంటి కమెడియన్ గుండు హనుమంతరావు మరణానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

 గుండు హనుమంతరావు అనే పేరు చెప్పగానే తెలియని వారు ఉండరు.. ఆయన ప్రస్తుతం మరణించినప్పటికీ ఆయన చేసిన సినిమాల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారు. అయితే అలాంటి గుండు హనుమంతరావు మరణానికి కారణం మూత్రపిండాల వ్యాధి.. ఇది కూడా ఆయన స్వయంగా బయట పెడితేనే అందరికీ తెలిసింది.. ఆలీ హోస్టుగా చేసిన ఓ షో కి గుండు హనుమంతరావు గెస్ట్ గా వచ్చారు. ఆ టైంలో తనకి వచ్చిన అనారోగ్య సమస్యల గురించి చెబుతూ బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత 12 కిలోల బరువు తగ్గాను. ఆ తర్వాత మూత్రపిండాల వ్యాధి వచ్చింది.. ఈ వ్యాధి చికిత్స తీసుకోవడం కోసమే సంవత్సరానికి ఆరు లక్షల ఖర్చు అవుతుంది.. అంటూ  చాలా ఎమోషనల్ గా చెప్పారు.


 అయితే ఈ షో చూసి ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలు తెలిసిన మెగాస్టార్ చిరంజీవి ఆయనకు రెండు లక్షల ఆర్థిక సహాయం చేశారు.అలాగే మూవీ ఆర్టిస్టులు అందరూ కలిసి ఆర్థిక సహాయం చేశారు. అంతేకాకుండా అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ ఐదు లక్షల ఆర్థిక సహాయం చేశారు. ఇక చికిత్స తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యం విషమించడంతో మళ్ళీ హాస్పిటల్ కి తీసుకువెళ్లే లోపే ఆయన మరణించారు. ఇక గుండు హనుమంత రావు మరణించిన సమయంలో కమెడియన్ బ్రహ్మానందం,ఆలీ,చిరంజీవి వంటి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కన్నీళ్లు పెట్టుకున్నారు.వాళ్లతో తమకు ఉన్న అనుబంధాన్ని కూడా పంచుకున్నారు. అలా గుండు హనుమంతరావు తన కామెడీతో ఎన్నో సినిమాల్లో నటించి తన కామెడీతో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించిన ఈయన మరణంతో ఎంతోమందిని ఏడిపించారు

మరింత సమాచారం తెలుసుకోండి: