ఇదే విషయాన్ని నేచురల్ స్టార్ నాని కూడా అంగీకరించాడు. తాను 15 ఏళ్ల నుంచి పరిశ్రమలో ఉన్నాను .. ఓ క్లాసు రూమ్ లో ఇన్నేళ్లు ఉంటే చాలా గట్టి సంబంధాలు ఏర్పడేవి .. మరి ఇండస్ట్రీలు కూడా అలాంటి బలమైన బంధాలు ఉండాలి కదా అంటూ స్పందించాడు. అయితే 1980 - 1990 నాటికి బాగా కలిసిపోతున్నారని .. తమ వాడు అనే ఫీలింగ్లో ఉన్నారని కానీ ఇప్పుడున్న హీరోలలో అలాంటి ఐక్యత కనిపించడం లేదని చెప్పాడు నాని. ఈ సందర్భంగా రామానాయుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు రానా. బయట వ్యక్తుల కంటే ఇండస్ట్రీ జనాలు ఎవరైనా వస్తే వాళ్లతో మాట్లాడటానికి రామానాయుడు ఎక్కువ ఆశక్తి చూపించే వారట దానికి కారణం ఏంటంటే ? వృత్తి పరంగా గతంలో చిన్న చిన్న తగాదాలు సమస్యలు వచ్చి ఉండవచ్చని అవకాశం దొరికినప్పుడు కలిసి మాట్లాడి కలిసి అవకాశం ఉంటుందని అన్నారట.
మరి ఈ తరం హీరోలలో ఎంతమంది ఆ పని చేస్తున్నారు. 30 ఏళ్ల పాటు పరిశ్రమలో కొనసాగాలని ఫిక్స్ అయినప్పుడు స్నేహితులని కూడా ఆ పరిశ్రమ నుంచే సంపాదించుకోవాలనేది రామానాయుడు ఫిలాసఫీ. ప్రస్తుత హీరోలు అలా కలవడానికి ఆసక్తి చూపించడం లేదు అనేది నాని కంప్లైంట్. ఏదైనా ఒకటి మాత్రం వాస్తవం ఇప్పుడున్న ఎంగేజ్ జనరేషన్ హీరోలు మరింత ఘోరంగా ఉన్నారని తేజా సజ్జా చెప్తున్నారు. కనీసం నాని - రానా జనరేషన్ హీరోల బెటర్ .. రాబోయే రోజుల్లో కలుస్తారని ఆశి ఉందని ఇప్పుడు వస్తున్న హీరోలను చూస్తే ఆ ఆశ కూడా ఉండటం లేదని అంటున్నారు.