బాల్య నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన వేణుమాధవ్... క్రమంగా కమెడియన్ గా మారిపోయాడు. ఈ తరుణంలోనే దాదాపు 400 వరకు సినిమాలు చేసి... టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కమెడియన్ గా కాకుండా హీరోగా కూడా చేశాడు వేణుమాధవ్. ముఖ్యంగా భూకైలాస్ అలాగే ప్రేమాభిషేకం, హంగామా సినిమాలలో వేణుమాధవ్ హీరోగా చేసి అందరి నిమిప్పించాడు.
ఆయన హీరోగా చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా 2006 సంవత్సరంలో లక్ష్మి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు గాను అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కమెడియన్ అవార్డులో భాగంగా నంది అవార్డు వేణుమాధవ్ కు ఇచ్చింది. అప్పటినుంచి.. వేణుమాధవ్ కెరీర్... జెట్ స్పీడ్లో ముందుకువెళ్లడం జరిగింది. విక్టరీ వెంకటేష్ ఒక్కడే కాదు... చాలామంది తెలుగు స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్గా చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు.
మిమిక్రీ లో కూడా చేయగల సత్తా ఉన్న వేణుమాధవ్... 2019 సెప్టెంబర్ 25వ తేదీన మరణించారు. వేణుమాధవ్ కు కాలేయ సంబంధిత వ్యాధి రావడంతో ఆయన మరణించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తెలుగు ప్రేక్షకులను నవ్వించిన వేణుమాధవ్ కు భార్య అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన కెరీర్ బాగున్నప్పుడే ఆశలు కూడా బాగానే సంపాదించాడట వేణుమాధవ్. ఆయన కుటుంబానికి ఎలాంటి డోకా లేకుండా... ఆస్తులు సంపాదించి పెట్టాడట.