కోలీవుడ్ యంగ్ క్రేజీ హీరో శింబు తన జీవితంలో చాలాసార్లు ప్రేమలో పడ్డానని ఒప్పుకున్నాడు. అంతేకాదు విడిపోవడం వల్ల ఎల్లప్పుడూ ఆ సందర్భం తనను మరింత మంచి వ్యక్తిగా మార్చిందని చెప్పాడు. నయనతారతో అతడి ప్రేమ వ్యవహారం అతడిని ఫిలిం ఇండస్ట్రీలోనే ప్రత్యేకంగా నిలిపింది .. అంతేకాదు నయనతారతో అతడు నడిపిన ప్రేమ వ్యవహారంతో శింబు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. 2012లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శింబు నయనతార తో తన సంబంధం గురించి చర్చించాడు. విడిపోయినప్పటికీ ఆమెది మంచి మనసు .. ఇప్పటికి ఒకరికి మరొకరు స్నేహంగానే ఉంటున్నామన్నాడు. శింబు మాట్లాడుతూ నయన్ మంచి వ్యక్తి .. మేము కేవలం స్నేహితులం కానీ మమ్మల్ని ప్రేమికులుగా ప్రచారం చేసి అనవసర రాద్ధాంతం చేశారు అని అన్నాడు.
నటనపరంగా ... వ్యక్తులుగా మేము ఇప్పటికీ ఒకరిని ఒకరు ఇష్టపడతాము .. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం ... చాట్ కూడా చేసుకుంటాం అని చెప్పాడు. శింబు స్వీయ దర్శకత్వం లో వచ్చిన వల్లభ షూటింగ్ టైంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే నయనతారకు శింభు పై ప్రేమ కలిగిందని టాక్. ఆ టైంలో నయన శింబునే పెళ్లి చేసుకునేందుకు ఫిక్స్ అయిపోయిందని... అయితే ఈ పెళ్లికి శింబు తండ్రి సీనియర్ నటుడు.. దర్శకుడు టి. రాజేందర్ ఒప్పుకోలేదని అంటారు. ఈ సినిమా తర్వాత ఇద్దరు చాలాసార్లు బయట డేటింగ్లలో దొరికారు. అంతేకాదు వీరు ఇంట్లో పెద్దలను ఎదిరించి కూడా పెళ్లి కూడా చేసుకుంటారు అని గట్టిగా ప్రచారం జరిగింది.
వారిద్దరి వ్యక్తిగత ఫోటోలు ఆన్లైన్లో విడుదలయ్యాయి .. దీంతో శింబు పై నెగిటివ్ ప్రచారం గట్టిగా జరిగింది. అది అతడి కెరీర్ పై ప్రభావం చూపించింది.. ఇది వారి మధ్య విభేదాలు మరింత పెంచి వారు మళ్ళీ స్నేహితులు కావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఎవరి జీవితాలతో వారు ముందుకు వెళుతున్నారు. శింబుతో విడిపోయిన నయన్ ప్రభుదేవాతో ప్రేమలో పడి డేటింగ్ చేసి.. చివరకు అతడికి కూడా దూరమై దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. నయన్‌తో విడిపోయాక శింబు హన్సికను ప్రేమించినా అది కూడా ఎక్కువ కాలం నిలవలేదు.