గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫ్ఫీ)లో తమిళ సూపర్ స్టార్ శివకార్తికేయన్ శనివారం ప్రత్యేక సెషన్‌లో పాల్గొన్నారు. తన సహ నటులైన కన్నడ సూపర్ స్టార్ యశ్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. కన్నడ చలన చిత్ర పరిశ్రమలో తనకు మొదటగా దగ్గరైన వ్యక్తి శివరాజ్‌కుమార్ అని శివకార్తికేయన్ తెలిపారు. "శివరాజ్‌కుమార్ సర్ ఎప్పుడూ నన్ను ప్రేమిస్తారు, గౌరవిస్తారు. వారితో మంచి స్నేహం కుదిరినందుకు నా మనసుకు ఎంతో ఆనందంగా ఉంది" అని ఆయన అన్నారు.

తన సహోద్యోగి యశ్‌పై శివకార్తికేయన్ ప్రశంసల వర్షం కురిపించారు. "నేను ప్రతి ఒక్కరి పనిని గౌరవిస్తాను, ప్రతి మంచి సినిమాను చూస్తాను. కానీ యశ్ చేసినది ఎక్స్‌ట్రార్డినరీ. KGF: చాప్టర్ 1 విడుదలైనప్పుడు, అది కన్నడ సినిమాకు ఒక విజయంగా జరుపుకున్నారు. అయితే, KGF: చాప్టర్ 2 తో, మొత్తం భారతీయ చలన చిత్ర పరిశ్రమ ప్రపంచ గుర్తింపు పొందింది." అని శివకార్తికేయన్ అన్నారు.

"యశ్ తన వ్యక్తిగత కెరీర్‌ను మాత్రమే కాకుండా, మొత్తం కన్నడ చలన చిత్ర పరిశ్రమను కూడా కొత్త ఎత్తులకు తీసుకెళ్లాడు. నేను అతన్ని అభిమానిస్తాను. అతనికి నిరంతర విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను" అని శివకార్తికేయన్ పంచుకున్నారు. ఒక హీరో అయ్యుండి మరొక హీరోను పొగడడానికి చాలామందికి నోర్లు రావు కానీ శివ కార్తికేయన్ మాత్రం హీరో యశ్‌ని పొగడ్తల వర్షంతో ముంచెత్తాడు. కన్నడ ఇండస్ట్రీ ఇన్ ఈరోజు వరల్డ్ వైడుగా గుర్తింపు తెచ్చుకుంది అంటే దానికి కారణం యశ్‌యేనని అన్నాడు. ఇక ప్రశాంత్‌ నీల్‌ కూడా ఈ సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి చేశాడని చెప్పుకోవచ్చు. అప్పుడు కన్నడ సినిమాల వేరే భాషల వారికి తెలిసేది కావు కానీ ఇప్పుడు ఆ ఇండస్ట్రీ నుంచి సినిమాలు ఎప్పుడు వస్తాయా అని చాలామంది ఎదురుచూస్తున్నారు.

విడుదలైన 23 రోజుల తర్వాత కూడా శివకార్తికేయన్ నటించిన 'అమరన్' సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా ఆడుతోంది. ఈ సినిమా ఇప్పటికే భారతదేశంలో రూ. 200 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ. 308 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది శివకార్తికేయన్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా, ఈ ఏడాది తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: