మొదట ఇంటర్ లో ఫెయిలైన ఆయన సప్లిమెంటరీ పరీక్షలో పాసయ్యారు. ఆ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసిన ఆయన హైదరాబాద్ లోని పంచాయితీ రాజ్ శాఖలో చేరారు. ధర్మవరపు ఆకాశవాణి కోసం కొన్ని రేడియో నాటకాలను సైతం రాశారు. ఆనందో బ్రహ్మతో తెలుగువాళ్లకు ఆయన దగ్గరయ్యారు. దూరదర్శన్ లో ఉన్న సమయంలోనే జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన జయమ్ము నిశ్చయమ్మురాలో ధర్మవరపుకు ఛాన్స్ వచ్చింది.
తోకలేని పిట్ట మూవీ ఫ్లాప్ కావడంతో ధర్మవరపు తర్వాత రోజుల్లో సినిమాల్లో నటించడంపై దృష్టి పెట్టలేదు. ఎక్కువ సంఖ్యలో సినిమాలలో లెక్చరర్ రోల్స్ లో నటించి ఆయన ఆకట్టుకున్నారు. ఒక్కడు సినిమా ధర్మవరపు కెరీర్ లో ప్రత్యేకం అనే చెప్పాలి. వర్షం, రెడీ సినిమాలు సైతం ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆరు నెలల పాటు ధర్మవరపు గారు కాలేయ క్యాన్సర్ తో బాధ పడ్డారు.
2013 సంవత్సరం డిసెంబర్ నెల 7వ తేదీన ఆయన మృతి చెందారు. ఆయన మరణం సినీ అభిమానులను ఎంతగానో బాద పెట్టింది. ధర్మవరపు దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ధర్మవరపు భౌతికంగా మరణించినా తమ గుండెల్లో జీవించే ఉన్నారని నెటిజన్లు, ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇండస్ట్రీలో వివాద రహితుడిగా ఆయన గుర్తింపును సంపాదించుకున్నారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు మాత్రం సినిమా ఇండస్ట్రీపై పెద్దగా ఆసక్తి లేదని సమాచారం అందుతోంది.