శోభిత ధూళిపాళ్ళ.. అన్న పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా మారు మ్రోగిపోతుంది అన్న విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . ఒకటి కాదు రెండు కాదు గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో నాగచైతన్య - శోభితా ధూళిపాళ్ళ పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి . కాగా డిసెంబర్ 4వ తేదీ వీళ్ళు గ్రాండ్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి చేసుకోబోతున్నారు . దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ నాగచైతన్య దగ్గర నుంచి అదే విధంగా నాగార్జున దగ్గర నుంచి వచ్చేసింది .


త్వరలోనే ఈ జంట భార్యాభర్తలుగా మన ముందుకు రాబోతున్నారు . ఇలాంటి మూమెంట్లోనే శోభిత ధూళిపాళ్ళ ఎవరు..? అసలు ఆమె ఎక్కడ మనిషి..? ఆమె తల్లిదండ్రులు ఎవరు ..? ఏం చేస్తూ ఉంటారు ..?నాగచైతన్యతో పరిచయం ఎలా ఏర్పడింది..? అన్న విషయాలను బాగా సెర్చ్ చేస్తున్నారు జనాలు. అయితే ఇదే మూమెంట్లో ఆమె తెలుగులో నటించిన గూడచారి సినిమాకి సంబంధించిన వార్తలను కూడా బాగా ట్రై చేస్తున్నారు కుర్రాళ్ళు .



గూడచారి సినిమాలో నటించే మూమెంట్లో తెలుగు హీరో అడవి శేష్ ..శోభిత ధూళిపాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చాడు అన్న వార్తలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి . ఒక సీన్ కోసం ఆమె ఎక్కువ టేక్స్ తీసుకుంటున్న మూమెంట్లో ఇలా అయితే నువ్వు హీరోయిన్ గా ఎదగలేవు అంటూ ఇంకా బాగా నటించాలి అంటూ అడవి శేష్..శోభిత ధూళిపాళ్లకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారట . ఆ తర్వాత కోపంతో శోభిత ధూళిపాళ్ళ ఆ సీను ఎక్కువ టైం ప్రాక్టీస్ చేసి తర్వాత రోజు షూటింగ్లో ఒకే దెబ్బకు ఓకే చేసే విధంగా నటించిందట. అక్కడే ఉండే వాళ్ళు చప్పట్లతో ఆమెకు అప్రిసియేషన్ కూడా ఇచ్చారట . ఈ వార్త అప్పట్లో బాగా ట్రెండ్ అయింది . మరొకసారి నాగచైతన్య భార్యగా తెలుగు ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమ్రోగిపోతూ ఉండడంతో ఇదే వార్తను మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు..!

మరింత సమాచారం తెలుసుకోండి: