చదువుకునే రోజుల నుంచి ఎమ్మెస్ నారాయణకు హాస్య రచనలపై ఆసక్తి ఉండేది. రవిరాజా పినిశెట్టి దగ్గర కొంతకాలం రచయితగా ఎమ్మెస్ నారాయణ పని చేశారు. కొడుకు, భజంత్రీలు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. భీమవరంలో తెలుగు లెక్చరర్ గా ఆయన పని చేశారు. పరచూరి గోపాలకృష్ణ దగ్గర ఎమ్మెస్ నారాయణ శిష్యరికం చేశారు. వేగుచుక్క పగటిచుక్క సినిమాకు ఎమ్మెస్ నారాయణ పేరు పడ్డ తొలి సినిమా కావడం గమనార్హం.
పశ్చిమ గోదావరి జిల్లా లోని నిడమర్రు వీళ్ల స్వగ్రామం కాగా మధ్యతరగతి రైతు కుటుంబంలో ఈయన జన్మించారు. కళా రంగంపై ఉన్న ఆసక్తితో ఆయన జాబ్ కు రిజైన్ చేసి సినిమాల్లోకి వచ్చారు. 2015 సంవత్సరంలో అనారోగ్య సమస్యల వల్ల ఎమ్మెస్ నారాయణ అస్వస్థతకు గురై తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. తన సినీ కెరీర్ లో ఎమ్మెస్ నారాయణ ఎక్కువగా తాగుబోతు రోల్స్ లో నటించారు.
పెదరాయుడు చిత్రంలో తొలిసారిగా వెండి తెరపై కనిపించిన ఎమ్మెస్ నారాయణ దాదాపుగా 2 దశాబ్దాల పాటు వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఎమ్మెస్ నారాయణ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. ఎమ్మెస్ నారాయణ మరణం ఆయన అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. ఎమ్మెస్ నారాయణ తన కామెడీ టైమింగ్ తో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. ఎమ్మెస్ నారాయణకు దూకుడు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.