'ఏయ్ బిడ్డా... ఇది నా అడ్డా !'  అని పుష్ప ది రైజ్‌ సినిమాలో అల్లు అర్జున్ పాట పాడు .. దాని కొంచెం మార్చి ఏ బిడ్డ తెలంగాణ నా అడ్డ అని అభిమానులు కొత్త పాట పాడవచ్చు .. ఈ మాట ఎందుకు చెబుతున్నాము అంటే.. మొదటిరోజు తెలంగాణలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా చరిత్రలో లేనట్టుగా భారీ ఎత్తున పుష్ప 2 సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తెలంగాణలో 440 థియేటర్లో రిలీజ్ అయింది .. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీని కూడా నైజాంలో 500 ధియేటర్లో రిలీజ్ చేశారు. ఆ రెండు సినిమాలు కంటే ఎక్కువ స్క్రీన్లు అల్లు అర్జున్ సినిమా ఇప్పుడు విడుదల చేసే సన్నాహాలు జరుగుతున్నాయి.


తెలుగులో విడుదలయ్యే సినిమాలకు వచ్చే అత్యధిక భాగం నైజాం నుంచి వస్తాయని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా 50% షేర్ తెలంగాణ నుంచి వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ ఏరియా మీద కన్నేశారు. 550 నుంచి 600  స్క్రీన్ ల వరకు పుష్ప2 సినిమాను విడుదల చేయడానికి మైత్రి మూవీ మేకర్స్‌ సన్నాహాలు చేస్తుంది.  డిసెంబర్ 5ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది .. అయితే డిసెంబర్4న ఓవర్సీస్ లో ఒకరోజు ముందుగానే రిలీజ్ చేయనున్నారు. ఇండియాలో మొదటి షో మైత్రి మూవీ సమస్త మైంటైన్ చేస్తున్న బాలానగర్ విమాల్ థియేటర్లో పుష్ప2 తొలి షో  వేయనున్నారు.


 డిసెంబర్ 4  అర్థ రాత్రి 9:00 తర్వాత ఈ షో పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ సొంతంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కలిగి ఉంది. కేవలం ఆ సంస్థ నిర్మించే సినిమాలను మాత్రమే కాదు ఇతర స్టార్ హీరోల సినిమాల నుంచి డబ్బింగ్ సినిమాల వరకు చాలా సినిమాలను సొంతంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది .. తన సొంత సినిమాను వీలైనంత ఎక్కువ థియేటర్లో విడుదల చేయడానికి రెడీ అవుతుంది మైత్రి మూవీ మేకర్స్‌ .నైజాం లో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ వారే ఈ సినిమా విడుదల చేస్తుండగా అక్కడ ఈ చిత్రం ఏకంగా 600 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ లు నిర్మాణం వహిస్తుండగా ఈ డిసెంబర్ 5న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: