తమిళ్ స్టార్ కార్తీ-సెల్వరాఘవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీ యుగానికి ఒక్కడు అప్పట్లో ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అయితే ఈ సినిమా ఇప్పుడు కనుక రిలీజ్ అయి ఉంటే పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించి ఉండేది..ఈ భారీ చిత్రానికి తమిళ్ ప్రేక్షకులు కంటే ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.. నటుడిగా కార్తీ చేసిన మూడవ చిత్రమిది. మూడవ సినిమాతోనే కార్తీ తన కెరీర్ లో భారీ ప్రయోగం ప్రయోగం చేసాడు.ఆ సమయంలో కార్తీ ఎంతో టెన్షన్ పడ్డాడు.. ఈ సినిమా సక్సెస్ అవుతుందా.. లేదా? అనే సందేహాలతో కార్తీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు.కానీ కోలీవుడ్ ను మించి టాలీవుడ్ లో ఈ సినిమా భారీ విజయం సాధించింది..ఈ సినిమాతోనే కార్తీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా రిజిస్టర్ అయ్యాడు. దర్శకుడిగా సెల్వరాఘవన్ కి ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ప్రేక్షకులకు యుగానికి ఒక్కడు మూవీ ఓ కొత్త అనుభూతిని కలిగించింది....ప్రేక్షకుడిని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన చిత్రమిది. ఇదిలా ఉంటే  ఈ భారీ సినిమాకి సీక్వెల్ గా యుగానికి ఒక్కడు-2`ను కూడా దర్శకుడు సెల్వరాఘవన్ ప్రకటించారు. 

ఇందులో హీరో కార్తీ కి బదులుగా ధనుష్ వచ్చి చేరాడు. అయితే ఈ ప్రకటనొచ్చి చాలా కాలమే అయింది.. రోజులు గడుస్తున్నాయి కానీ ఈ ప్రాజెక్ట్  మాత్రం ముందుకు కదలడం లేదు..ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అంతా అనుకున్నారు... అయితే ఈ సినిమా ఆగిపోలేదంటూ సెల్వరాఘవన్ మీడియా ముందు తెలిపారు..ఈ సినిమా తప్పకుండా చేస్తామని..కానీ దానికి కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు...ఈ సినిమా కంటే ధనుష్ మరో సినిమా సీక్వెల్ చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత `యుగానికి ఒక్కడు ఉంటుందని ఆయన తెలిపారు.ఇంతటి భారీ సినిమాకు నటీనటుల ఎంపిక అన్నది చాలా కష్టంతో కూడుకున్నది అని ఆయన చెప్పుకొచ్చారు. పాత్రలన్నింటికి సరిపోయే నటులున్ని ఎంపిక చేయడానికి చాలా సమయం పడుతుందని ఆయన అన్నారు...తొలి భాగాన్ని మించి రెండవ భాగంలో పాత్రలుంటాయని సెల్వరాఘవన్ తెలిపారు..ఈ సినిమా తీయడానికి సమయం కూడా వచ్చిందని త్వరలోనే అప్డేట్ ఇస్తామని ఆయన ప్రకటించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: