కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కీర్తి సురేష్ ఆంటోనీ తటిల్ ల ఫోటోలే కనిపిస్తున్నాయి. దాంతో వీరి పెళ్లి రియల్గా ఏమో గాని సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది.. ఇప్పటికే చాలాసార్లు పెళ్లి వార్తలతో విసిగిపోయిన ఈ ముద్దుగుమ్మ చివరికి పెళ్లి చేసుకోబోతుంది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.అలాగే కీర్తి సురేష్ తండ్రి నిర్మాత జి సురేష్ కుమార్ కూడా కూతురికి సంబంధించిన పెళ్లి వార్తలు నిజమేనని కన్ఫర్మ్ చేశారు. దీంతో అభిమానులు అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకునే సమయంలో పెళ్లికూతురు తరపున వాళ్ళు పెళ్ళికొడుకు తరఫున వాళ్లు కండిషన్లు పెడుతూ ఉంటారు. అలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న కీర్తి సురేష్ కి కూడా పెళ్ళికొడుకు తల్లి ఒక కండిషన్ పెట్టిందట. మరి ఇంతకీ పెళ్లి కొడుకు తల్లి పెట్టిన కండిషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

 స్కూల్ డేస్ లో ఎక్కువగా గొడవపడే ఆంటోని కీర్తి సురేష్ ఇద్దరు మొదటిసారి 9th క్లాస్లో ప్రేమలో పడ్డారట. అప్పటినుండి ఇప్పటివరకు తమ ప్రేమని కంటిన్యూ చేస్తున్నారట. అయితే డిసెంబర్ 11 లేదా 12వ తేదీన పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట  పెళ్లి వార్తలు ఇప్పటికే మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక బిజినెస్ మాన్ అయినటువంటి అంటోని తట్టిల్ ని పెళ్లి చేసుకోవడానికి కీర్తి సురేష్ ఫ్యామిలీ ఒప్పుకుందట. కానీ కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకోవడానికి ఆంటోని తల్లి మాత్రం కాబోయే కోడలికి ఓ కండిషన్ పెట్టిందట.

 అదేంటంటే.. కీర్తి సురేష్ ని సినిమాల్లో నటించమని చెప్పిందట కానీ బోల్డ్ పాత్రల్లో నటించకూడదు అని ఓ కండిషన్ పెట్టిందట. అయితే అత్తయ్య చెప్పిన కండిషన్ కి కీర్తి కూడా ఓకే చెప్పడంతో వీరి పెళ్లికి ఎలాంటి అడ్డంకి లేదని తెలుస్తోంది. అయితే తాజాగా విడుదలైన బేబీ జాన్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ లో వరుణ్ ధావన్ తో కలిసి కీర్తి సురేష్ చాలా రొమాంటిక్ లుక్ లో కనిపిస్తోంది. మరి పెళ్లి తర్వాత బోల్డ్ పాత్రల్లో నటిస్తుందా లేక అత్త పెట్టిన కండిషన్ కి తలొగ్గి కేవలం సాంప్రదాయమైన పాత్రల్లోనే చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: